ఆంధ్రజ్యోతి వర్సెస్ తెలంగాణ నమస్తే.. వాస్తవం ఎవరి వైపు

ప్రపంచమంతా ఉన్నదే...తెలంగాణలో జరుగుతుంది..ఇది కాదన్నట్లు బిల్డప్ ఇస్తేనే..ఇలాంటి పత్రికల యుధ్దాలు చోటు చేసుకుంటాయ్..పత్రికల ధర్మం..వాస్తవమో..అవాస్తవమో  ఎంచి చూడటం కాదు..జరిగింది తాము చూసింది రిపోర్ట్ చేయడం...అంతేకాదు..తీర్పరిగా కాకుండా...అద్దం పట్టడమే..ఇది మర్చిపోయి..వాళ్లే ఇన్వెస్టిగేషన్ చేస్తారు..వాళ్లే తీర్పులు ఇస్తారు..వాళ్లే శిక్షలు వేస్తారు..అందుకే మీడియా అంటే ఎంత గౌరవం ఉందో..అంత అసహ్యం కూడా పుడుతోంది..

కరోనా కేసులతో ఓ వైపు ప్రభుత్వ వైద్య సిబ్బంది శక్తి సామర్ధ్యాలు వెలికి వస్తే..మరోవైపు..నిస్సహాయత కూడా బైటపడుతోంది..లెక్కకి మించిన కేసులు బైటపడటం ఎవరి అసమర్ధతా కాదు..కాని కనీసం సౌకర్యాలు కల్పించడం..కనీస స్థాయిలో స్పందించడం చేయాల్సింది ప్రభుత్వం..యంత్రాంగమే...ఆంధ్రజ్యోతి తన అవసరాలకో..మరొకందుకే ఓ విషయం రాస్తే..దానికి చేతనైతే సమాధానం చెప్పాలి..లేదంటే..ఇగ్నోర్ చేయాలి..అంతేకానీ..రెచ్చిపోయి..అబద్దాల ఆంధ్రజ్యోతి..అని నమస్తె తెలంగాణ ఎందుకు రెచ్చిపోవాలి..పైగా ఆంధ్రా మీడియా అంటూ రాతలేంటి..అంటే ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ..ఏపీవాసులు కానీ నమస్తే తెలంగాణ పత్రిక కొనకూడదా...
దానికి ఆంధ్రజ్యోతి కూడా అదే స్థాయిలో స్పందించడం ఎందుకు...వాస్తవమైతే..గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే..ఓ పేషెంట్ తనకి టెస్ట్ చేయమంటే ఎన్ని తిప్పలు పడాలో అందరికీ తెలుసు..ఆ తర్వాత బెడ్ దొరకడం..ఆ తర్వాత క్షేమంగా ఇంటికి చేరడమంటే..ఎంత నరకప్రాయంగా ఉందో మంత్రులకు..నమస్తే తెలంగాణకి తెలుసా... ఓ వైపు కరోనా సోకి ఏడుస్తుంటే..కొంపల్లోంచి వెళ్లగొట్టే ఓనర్ల స్టోరీలు ఎందుకు రాయదు నమస్తే తెలంగాణ..
అందుకే ఈ ఎదవ సిటీలో ఉండలేమని ఎంతమంది ఊర్లకి వెళ్లారో ఏమైనా ఎప్పుడైనా రాసిందా...మింగలేక మంగళవారు కబుర్లు రాసుకుంటే..ఇలానే ఉంటుంది

Comments