ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అపర కుబేరుడు కాబోతున్నాడా

రికార్డుల రారాజు...రాజాధిరాజు( ప్రస్తుతానికి) ప్రపంచంలోనే కుబేరుడు కాబోతున్నాడా....
ఆల్రెడీ వారెన్ బఫెట్ ని దాటేసాడు..బఫెట్ గురుగా మారే సమయానికి అసలు ముకేశ్ అంబానీ నిక్కర్లు కూడా వేసుకుని ఉండడు..ఎలాన్ మస్క్..ని దాటేసాడు..జుకర్ బర్గ్...జెఫ్ బెజోస్..బిల్ గేట్స్..ఆర్నాట్ మాత్రమే మనోడి కంటే పైన ఉన్నారు..రిలయన్స్ షేరు ఇంకో 200 పెరిగిందా..నా సామిరంగా అంతా డంగైపోతారు..

లక్షా ఆరవై వేల కోట్ల రూపాయల అప్పున్న కంపెనీని ఏడాదిలోపే అప్పుల్లేన ికంపెనీగా మార్చుతానని మార్చి 31 2019లోనో..ఇంకెప్పుడో ఓ శపథం చేసాడు..ఆ ఏం చేస్తాడ్లే..ఇవన్నీ మామూలేగా..వాళ్ల తమ్ముడు అనిల్ అంబానీ కూడా ఇలానే కంపెనీకి ఉన్న  అప్పులన్నీ తీర్చేస్తా  అన్నాడు..ఈయన కూడా అంతే అనుకున్నారు..9 నెలలు గడిచిపోయాయ్..జనవరి వచ్చింది..ఇంతలో కరోనా కూడా వచ్చింది..ఐనా మెల్లగా జియో...రిలయన్స్ గురించిన
న్యూస్ స్ప్రెడ్ అవుతోంది..గాసిప్స్ అనుకున్నారు..
అదిగో కరోనా విజృంభణ ప్రారంభమైంది..మరోవైపు ఏప్రిల్ లో ఫేస్ బుక్ జియోలో వాటా కొంటుందంటూ ఓ లీక్ వచ్చింది..మే వచ్చేసరికి నిజమైపోయింది..అప్పట్నుంచి అసలు లిస్టే కానీ కంపెనీలో ఎవరు వేల్యూ కట్టారో ఏం కథో కానీ..ఒక్కో కంపెనీ పిచ్చెక్కినట్లుగా ఊగిపోతూ..జియోతో జట్టు కట్టింది..కట్ చేస్తే
మార్చి 2021 కి ముందే జియోలో కేవలం 30శాతం లోపే వాటాలను అమ్మడం ద్వారా లక్షా 75వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ముకేశ్ అంబానీ..రిలయన్స్ రైట్స్ ఇష్యూ అంటూ మరో 53వేల కోట్లు...బ్రిటీష్ పెట్రోలియంకి జాయింట్ వెంచర్ లో వాటా సేల్ తో మరో 8వేల కోట్లు..( అటూ ఇటూ కావచ్చు లెక్క) ..మొత్తంగా రెండు లక్షల కోట్ల మేర డబ్బు సేకరించాడీ హీరో...
రిలయన్స్ సంస్థ ఇంకో రికార్డు చూడండి..కేంద్రానికి కట్టిన జిఎస్టీ 65వేల కోట్లు..అంటే ఓ మోస్తరు రాష్ట్రం బడ్జెట్ తో సమానం..
ఇంత చేసిన తర్వాత ఇక జ ియోతో జీవితం..మార్చేస్తానంటూ 5జిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..ఈలోపు షేర్ రేటు అమాంతంగా  పెరుగుతూ వస్తోంది రెండు వేల రూపాయలు దాటేసింది..దాంతోనే ఇక వరల్డ్ రియల్ టైమ్ రిచ్చెస్ట్ లిస్ట్ లో అందరినీ దాటుకుంటూ టాప్ 5 ర్యాంకర్ గా నిలిచాడు..రియల్ టైమ్ అంటే రేపు షేర్ వేల్యూ పడిపోతే..మనోడి ప్లేస్ కూడా తగ్గుతుంది..కాన ీఅసలు   ఈ స్థాయికి వచ్చాడంటే..అదెంత గొప్ప..

Comments