అచ్చెనాయుడిపై కోర్టు ధిక్కారం కేసు నమోదు అవుతుందా

 


ఆంధ్రా సిఎం వైఎస్ జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నడుస్తున్న సంగతి పాలిటిక్స్ ని ఫాలో అయ్యేవాళ్లందిరకీ తెలుసు..ఆ ఆరోపణలతో సిబిఐ ఆయన అరెస్ట్ చేసిన సంగతి..( సిఎం కాకముందు) తర్వాత బెయిల్ ఇచ్చిందీ తెలుసు..ఐతే లక్ష కోట్ల రూపాయలంటూ తెగ ఆరోపించినా...వాటిలో మొత్తం 43 వేలకోట్ల రూపాయలను..ఆ తర్వాత ఒక్కో ఛార్జ్ షీట్లో తగ్గించుకుంటూ చివరికి ఏ స్థాయికి తగ్గించిందీ మాత్రం  చాలా కొద్ది మందికే తెలుసు..


ఐనా కూడా అచ్చెనాయుడు గారు..అసలే ఈ మధ్య పార్టీకి ప్రెసిడెంట్ అయిన ఊపులో ఏదోటి ఇరగదీయాలనే తపనలో కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..అర్ధమవుతోంది..కనబడుతోంది..ఇలాంటి ఎన్ని దిలైనా పెట్టుకోవచ్చు.

ఎందుకంటే ఆయన పార్ట ీ(ఏపీ)కి ప్రెసిడెంట్ కాగానే ఓ ఛానల్ గంటల కొద్ద ీలైవ్ నడిపి..అక్కడికేదో ఆయనకి పదవి రాగానే టిడిపి పరుగులు పెడుతుందని..జైత్రయాత్ర సాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది..పైనా కిందా అవే వ్యాఖ్యలు ప్రసారం చేస్తూ తరించిపోయింది..ఏ పార్టీకైనా ఎవరైనా భజన చేసుకోవచ్చు అందులో తప్పేముంది కానీ మద్యలో గెస్ట్ వ్యాఖ్యానాలను సరిచేయాల్సిన అనుసంధానకర్త కూడా పళ్లికిలించుకుంటూ చూస్తుండటమే ఆ ఛానల్ కి కూడా సబ్ జ్యుడిష్ చీవాట్లు పడతాయేమో చూడాలి..ఎందుకంటే..లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసినట్లు దాన్ని కోర్టు కూడా ధృవీకరించిందని..రుజువైందని..ఏదేదో మాట్లాడేశారు అచ్చెన్న..ఇప్పుడు కానీ ఎవరైనా కోర్టుకి వెళ్తే పాపం అత్యుత్సాహం కాస్తా..నీరుగారుతుందేమో..అంతటితో ఆగకుండా..బోను కూడా ఎక్కితే..?

Comments

  1. అచ్చెన్న పైన కోర్టుధిక్కరణ కేసు నమోదు చేయవచ్చు. ఈవిషయంలో ఏన్యాయవాదీ, ఏన్యాయమూర్తీ సంకోచించరని అనుకోవచ్చును. ఇకపోతే జగన్ గారి పై కూడా కోర్టు ధిక్కార ంంంంంంంంంం...

    ReplyDelete
  2. కోర్టు ధిక్కరణ అనేది కోర్టు ఆదేశాలని వ్యతిరేకించినపుడు వర్తిస్తుంది. ఇక్కడ మేటర్ వేరు. కావాలంటే పరువు నష్టం కేసు వేసుకోవచ్చు.

    ReplyDelete
  3. కోర్టు ఆదేశాలంటే..కేవలం తీర్పుపై మాత్రమే కాదు..విచారణలో ఉన్న కేసులపై వ్యక్తిగతంగా తీర్పులు ఇచ్చినట్లు మాట్లాడటం కూడా ధిక్కరణ కిందకే వస్తుంది మాస్టారూ..

    ReplyDelete

Post a Comment