చంద్రబాబుగారికి ఎదురైన అనుభవం చూస్తే జాలేస్తుంది..అలానే పోలీసులను చూసినా కూడా

 


70ఏళ్ల వయసు..పార్టీని నిలబెట్టుకోవాలనే తపన. జనంలో తన ఇమేజ్ ఎంత డామేజ్ అయింది లేనిదీ తెలుసుకోవాలనే ఆరాటం. వెరసి ఆయనకి చివరి రోజుల్లో భయంకరమైన అనుభవాలను ఎదురు చేస్తోంది. ఐతేనేం ఆయనలోని ఫైటర్, మడమతిప్పని నైజం కూాడ ఈ రోజుల్లో మనం గమనించవచ్చు. పార్టీ ఓటమి తర్వాత ఆయన పోరాడుతున్న తీరుని చూసి..అటు జిరంజీవి కానీ పవన్ కల్యాణ్ కానీ నేర్చుకోవాల్సింది చాలా చాలా చాలా ఉంది..ఓ వైపు వేటాడుతున్న అదికారపక్షం మరోవైపు ఎదురవుతున్న ఓటములు


కానీ ఎయిర్ పోర్ట్ లో ఆయన కిందే కూర్చుండిపోవడం చూస్తుంటే..ఇది సరైన వ్యూహం కాదనిపిస్తుంది. ఓవైపు కుర్చీ తెచ్చిన తర్వాత కూడా అలానే కూలబడితే..నిస్సందేహంగా ఆయనప సింపతీ పెరిగింది..కానీ అప్పట్లో జగన్ 

విశాఖ ఎయిర్ పోర్ట్లో నిలిపివేసిన ఘట్టాన్ని తెలీకుండానే ఎవరైనా పోల్చుకుంటారు..ఇక్కడే  ఆయనకి వచ్చిన సానుభూతి కాస్తా గాల్లో కలిసిపోయింది. అక్కడ పోలీసులు కూడా నేలపైనే కూర్చుండిపోయి రెండు చేతులూ జోడించి మరీ ఆయనకు నచ్చజెప్పడం కూడా అందరూ  చూశారు. దీంతో చంద్రబాబుగారు ఎంత సంయమనంతో చూసినా, మాట్లాడినా, పోలీసుల తీరులో ఎలాంటి తప్పును జనం చూపలేరు. ఎందుకంటే వాళ్లెక్కడా రఫ్ గా బిహేవ్ చేసింది లేదు..ఇక్కడే చంద్రబాబుగారుని తిరుపతిలో అడుగు పెట్టనీయలేదనే ఎపిసోడ్ కి లాజికల్ కంక్లూజన్ లేకుండా పోయింది. అటు మద్దతిచ్చేవాళ్లెంత మంది ఉన్నారో..వ్యతిరేకించేవారీ గ్రూప్ కూడా అదే సంఖ్యలో చీలిపోయారు..కానీ చంద్రబాబులాంటి రాజకీయనేతకి మాత్రం ఇలాంటి స్థితి ఎదురవకూడదు

Comments