సామీ ఏ కీలుకా కీలు విరగ్గొట్టకండి..వకీలు సాబుని అడ్డుకుంటుంది కరోనాతోనే తప్ప..కసితో కాదు..! ఐనా పవన్ చూసి కూడా దడుసుకుంటారా..?

 


రెండు రోజుల నుంచి మన ఆంధ్రుల అభిమాన పత్రికలో రాయడం, రాసినదాన్ని సదరు పార్టీ చోటా మోట లీడర్లు మోయడం ఆ మోసినదాన్ని వీళ్లు మళ్లీ రాసుకోవడం..రాసుకున్నదాన్ని పూసుకోవడం..ఇలా చివరికి బూడిద రాలుతుంది తప్ప ఒరిగేదేం లేదు..పైగా సదరు హీరోగారిని చూసి జగన్ మోహన్ రెడ్డి ఆయన పార్టీ దడుసుకుంటోందట..

నిజమే మరి పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన హీరోని చూసి భయపడాల్సిందే. ఇంకా చెప్పాలంటే గెలిచిన ఒకటి రెండు సర్చంచ్ సీట్లతోనే మార్పు ప్రారంభమైపోయిందని సంబరపడే వీరసైనికులను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే..! పైగా ఈయనకి భాజాలు వాయించడానికి మరో కషాయం జెండా..అక్కడికేదో ఆయనపై తెగ పేమ కారిపోతున్నట్లు..బెినిఫిఠ్  షోనే రద్దు చేస్తారా..ఏం ఈ భూమి ఇంకా చీలిపోలేదేం..ఏమనుకుంటున్నారు..ఆ మోదీ సాబ్ చూసారా ఈ దారుణం మన సినిమానే ఆపేస్తారా అంటూ వీరాలాపాలు..! 

మింగలేక మంగళవారం అన్నట్లుగా..అసలు పార్టీ గుర్తునే ఇతరులకు కేటాయించుకోలేకపోని, ఆ స్థాయిలో ఓట్లు తెచ్చుకోలేని ఓ పార్టీని చూసి ఇంకో పార్టీ భయపడుతుందంటే వెంటనే నమ్మేయాలి..అసలు ఇప్పటికే తామెందుకు ఓడిపోయామో చెప్పుకోవడానికి  ఓ  బలమైన గాజుగ్లాసులాంటి కారణం రెడీగా దొరికిపోయిందని సదరు రెండు పార్టీలు తెగ సంబరపడుతున్నాయే తప్ప..మా పార్టీ సింబల్ ఇంకో పార్టీకి ఎలా కేటాయిస్తారని గట్టిగా అడిగే దమ్మేదీ..అహ..మాకు చూపక్కర్లా..ఢీల్లీ లెవల్లో ఏ కీలుకాకీలు ఇరగదీయగల సత్తా ఉన్న రెండు పార్టీల మైత్రీబంధం ఈ మాత్రం సాయపడలేదా..ఓహో...నిజాయితీగా పోతున్నారా..మరి కరోనా టైమ్ లో ప్రతి స్టేట్ 50శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాలు రన్ చే స్తుంటే...తెలుగు స్టేట్స్ లో ఆ రూల్ మాత్రం అమలు కావద్దంటారా..


అంతెందుకు సార్ మీ అన్నయ్యగారు మాత్రం కావాల్సినంత డిస్టెన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తో చూడొచ్చు కానీ..మిగిలిన ప్రేక్షకులకు మాత్రం ఆ అవకాశం వద్దంటారా..?



పైగా ఒక్క సినిమా చేస్తే కనీసం 1000మంది బతుకుతారనే చెప్పే హీరోగారు..తమ సినిమా థియేటర్లలోఆడియెన్స్ లోడు ఫ్లులుగా దింపేస్తే వైరస్ రాదంటారా...అదేంది..మరి ఆ లెక్కన బార్లు పబ్బులు కూడా మూయాలి కదాని రూల్స్ తీయొద్దు  ముందు మీ సంగతి ఏడవండి...ఆపై ఎటూ అభినవ నరకాసురుడు వైఎస్ జగన్ సంగతి జనం ఎప్పుడో గ్రహించారని చెప్తుంటారు కదా..ఆయనెటూ దుర్మార్గుడే..జనాన్ని పట్టించుకోడు..మరి మీరు మీ మాజీ స్నేహపార్టీ..తాజా కమలమైత్రి అంతా జనం కోసమే పుట్టి జనం కోసమే పెరిగి..జనంపైనేబతికి ( సారీ తప్పు అర్ధం కాదు) జనంతోనే బతికేవాళ్లు కదా..మీకుండక్కర్లేదా ఆ బుద్ది..అంతే సార్ అంతే మంచికి రోజులు కావు వకీల్ సాబ్..మీరు ఏ కీలుకాకీలు విరిచేయండి సార్..పైగా మూడేళ్ల తర్వాత హిట్టు..అంటున్నారు..ఐనా మీరు నటన మానిందెప్పుడు సార్..!

Comments