అంచేత.. లాక్‌డౌన్‌ అనగా తాళానికి పాక్షికంగా అయినా సిద్ధపడండి సామీ..! జాతికి మోదీ సాబ్ ఇచ్చిన సందేశం ఇదేనా?



 మనిషి ప్రవర్తనలో మార్పు రావాలంటే ఒకటి భయం ఉండాలి లేదంటే అవసరం ఏర్పడాలి.  ఈ రెండూ ఉన్నా కూడా జనం  రోడ్లపై తిరగడం మానలేదు. మాస్కులూ పెట్టుకోవడం లేదు. అంటే బతుకు మీద భయంతో రోడ్లపైకి వచ్చే పని ఉంటుంది

లేదంటే రోజు గడవాలంటే బయటకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే భయం, అవసరం ఉన్నా కూడా మనకి 

రోడ్లపై పుట్టలు పుట్టలుగా జనం ఉన్నారు..మరి మోదీ సాబ్ రాత్రి ఏం చెప్పారు..ఒరే సామీ...తిరగమాకండ్రా, అంటించుకోకండి..లాక్ డౌన్ నుంచి కాపాడాల్సింది మీరే అని చెప్పారు. అలానే లాస్ట్ వెపన్ అదే అని కూడా అన్నారు..ఇక్కడ ఆయన లేదు అని చెప్పలేదు..లాస్ట్ వెపన్ మాత్రం అదే అని చెప్పడంలో " చేసేదేం లేదు...మీకు చెప్పినా వినడం లేదు..కాబట్టి ఇక నా తప్పు లేదు..మీ ప్రాణాల  కోసం మాకు ఇష్టం లేకపోయినా పెట్టాల్సి వస్తుందని ఓ దండం పెట్టి మరీ మూత బిగించరనేం లేదు..ఈ స్థితి రాకుండా ఉండాలంటే మరి మనం నిజంగా ఆయన చెప్పినట్లుగా ఇంట్లో ఉంటున్నామా లేదు ఎందుకంటే..." తిరగొద్దని చెప్పలేదుగా " అని లాజిక్కులు లాగుతున్నాం..


అందుకే అధికారికంగా చెప్తే ఉంటాం లేకపోతే తిరుగుతాం అన్నట్లు ఉన్న వ్యవహారశైలిని మార్చాలంటే తాళాలను ప్రయోగిస్తారేమో మరీ

Comments