వామ్మో గంట కళ్లు మూస్కోవాలా...మరి ఐదేళ్లు ఏం మూస్కున్నారయ్యో...పరిటాల సిచ్యుయేషన్ చూస్తే జాలేస్తుంది..అదిగో వంశీ సవాల్ చేశాడు మరి




మా వాళ్లకి బీపీ వస్తే ఏపీలో మీరుండరు-ఇది పాపం మందలగిరి మాలోకం గారి మాస్ వార్నింగ్

కుక్కల్ని ఉసిగొలపడం కాదు దమ్ముంటే నువ్వేరారా అంటూ మరో డైలాగ్


ఇంతలోనే పాపం ఉన్నట్లుండి తమ భర్తగారు ఎలా చనిపోయారో తెలిసిన ఓ మాజీ మంత్రి -మేమే ఈ సారి పవర్ లోకి వస్తాం..అప్పుడు బాబుగారు ఓ గంట మూసుకుంటే చాలు..మొత్తం లేపేస్తామన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. మా భర్తని చంపినవాళ్లు రోడ్డుపై తిరుగుతున్నా ఊరుకుంటున్నామంటూ

అభినవబౌద్ధ అవతారం దాల్చారు..


మాకు తెలియక అడుగుతాం 2014-19 వరకూ ఎవరమ్మా పవర్ లో ఉంది..మరప్పుడు లేవని నోరు ఇప్పుడు పెగిలిందేం..భర్తని హత్య చేసినవాళ్లనే సదరు బాబుగారు పార్టీలోకి తీసుకువస్తుంటే లేవని గొంతుక ఇప్పుడు విప్పుకుంటుందేం..పైగా గంట కళ్లు మూసుకోవాలంటూ లేని పోని ఇమేజ్, క్రెడిట్స్ ఆయనకి అంటగడుతున్నారేంటి..? టిడిపి లీడర్లే అంత శాంతికాముకలైతే..పింగళి దశరధరామ్ ఎలా చనిపోయాడు..వంగవీటి రంగా, రాధా ఎలా చనిపోయారు సూరి అలియాస్ రెడ్డి ఎలా చనిపోయాడు, కాట్రగడ్డ ఎలా చనిపోయాడు..వైఎస్ రాజారెడ్డి ఎలా చనిపోయాడు..(ఈయన్ని మర్డర్ చేసింది టిడిపి లీడర్లే

ఆ తర్వాత వాళ్లు బైటికి వచ్చిన తర్వాత తిరిగి చేరిందీ టిడిపిలోనే) పశ్చిమగోదావరి జిల్లాలో ధనేకుల శివ హత్య ఏంటి,చిత్తూరు జిల్లాలో సికే బాబుపై అన్నిసార్లు మర్డర్ అటెంప్ట్స్ ఎందుకు జరిగాయ్..? అప్పుడు కూడా టిడిపి కళ్లు విప్పార్చుకునే చూస్తుందా..?


హత్యల విషయానికి వస్తే..ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు..అందరూ ఒకటే..అసలు ఇలా హత్యలకు దిగేవాళ్లకి పార్టీలు ఉండవ్..ఎలాగోలా పబ్బం గడుపుకునేందుకగు

పార్టీలు మారుతుంటారు..లీడర్లు వాళ్ల వెనుక క్యాడర్ ఉన్నారనే భ్రమతోనో, ఇంకో ఆబ్లిగేషన్లతోనో పార్టీల్లోకి తీసుకుంటారు తప్ప..ఫలానా పార్టీ ఉంది కాబట్టే

దాడులు హత్యలు జరుగుతున్నాయనడం ఏంటి..ఐతే ప్రస్తుత పరిస్థితిని తమ భర్త హత్య హంతకులతో ముడిపెట్టడమే కాస్త విడ్డూరంగా ఉంది.జనం చప్పట్లు కొడతారనుకుని..ఇలా పెద్ద డైలాగులు వేస్తే, చిన్నా చితకా జోకర్లైతే పట్టించుకోరు, గుర్తుంచుకోరు..పెద్ద పెద్ద లీడర్లు అందరికీ గుర్తున్నవారు ఇలాంటివి మాట్లాడితే వెంటనే రివర్స్ అవుతాయవి


అందుకే ఒకప్పుడు ఆ కుటుంబానికి దగ్గరగా మెలిగిన వల్లభనేని వంశీ కూడా రివర్స్ డైలాగ్ పేల్చాడు. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తేల్చుకుందాం

నే రాజీనామాచేస్తా రండంటూ సవాల్ విసిరాడు. రాజకీయ భిక్ష కూడా చంద్రబాబే పెడితే ఇలా తిడుతున్నారంటూ కొడాలినాని, వంశీని విమర్శించిందామె.దానికోసమే ఎదురు చూస్తున్నట్లు వంశీ ఇప్పుడు ఫైరయ్యాడు మరి రియాక్షన్ వస్తుందా టిడిపి నుంచి?

Comments