సజ్జల దెబ్బకి సఫా.. ! సూప్‌లో ఫుల్లుగా ఇరుక్కుపోయిన టిడిపి



ఆ బూతులు ఆంబోతుల్లాగా మాట్లాడేసి ఆ తర్వాత దానిపై దీక్ష చేయడం ఒకెత్తు అయితే..అలాంటి పదమే తాను వినలేదని పాపం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగారు వాక్రుచ్చడం మరో రేంజ్ 


పట్టాభిగారు వాక్రుచ్చిన అమృత తుల్యపలుకులకు అసలు అర్ధం వేరే ఉందట..మరి వేరే అర్ధం అంత సునృతమైతే, అంత ఆవేశంగా ఒరేయ్..రేయ్..అంటూనే ఉన్నట్లుండి మధ్యలో మర్యాదపూర్వకమైన మాట ఎలా వాడగలరు..అంత అపరిచితుడా సదరు కొమ్మారెడ్డి.. సరే అది వదిలేద్దాం..ఎవడూ లైవ్ ఇవ్వడంలేదనే పిచ్చ ఆవేశంలో అలా మాట్లాడాడు నోరు జారాడు అనుకుందాం..మరి దాన్ని సమర్ధించడం ఏంటి


పైగా రాగల 36 గంటలూ అంటూ బాబుగారి దీక్ష చేయడం వరకూ పొలిటికల్ ఎత్తుగడ బానే వేసారు..కానీ అక్కడ కూడా అవే సీన్ రిపీట్,చేయడం..ఆ తర్వాత బాబుగారు అసలు మా పట్టాభిషేకుడు వాడిన పదం..ఎప్పుడూ వినలేదంటూ కవర్ చేయడం ఏంటి 


అంటే ఎహ పో..అదసలు బూతే కాదు..ఎవరూ వాడరు..నువ్ అనవసరంగా ఫీలవుతున్నావ్..పైగా అదో మంచి పదం కూడానూ..అన్నట్లుగాఆయన ప్రసంగించారు..ఇదే అసలు అప్పటిదాకా బాబుగారి ఎపిసో‌డ్‍‌ని వచ్చిన మైలేజీ కాస్తా సైడైపోయేలా చేసింది


అది బూతు కాదు..దానికి వేరే అర్ధాలున్నాయ్ కదా..మరి వాటినే రేపు అమిత్ షాను, ఇతర కేంద్రమంత్రుల దగ్గర కూడా వాడండి వాడి చొక్కా నలగకుండా తిరిగి రండంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా సైలెంట్‌గా గడ్డి పెట్టాడు..దీనికి సమాధానం ఉందా మరి టిడిపి దగ్గర ఉండదు..ఆల్రెడీ పార్టీ ఆఫీస్‌పై జరిగిన విధ్వంసం జనం మర్చిపోయేలా...ఈ ఎపిసోడ్ ముందుకు వచ్చింది..దాడి సంగతి తర్వాత..ముందది బూతో కాదో తేల్చండనే టాపిక్కే హైలైటవుతుంది..మరి దీన్ని సూప్‌లో పడిపోవడం అనక ఏమంటారు


ఇప్పటికే బో..కే..పట్టాభి అని..బో..కే రాజు అని రివర్స్ ట్రోలింగ్ పీక్ స్టేజ్ కి వె ళ్లిపోయింది కూడా..ఇకపై పాపం కె.పట్టాభి ఇంటిపేరుగా బి...కే పట్టాభి అని మారిపోతుందేమో..

Comments