రాజధాని ఒకటే..కానీ ఇంతకీ అది ఏది ( ఇంకా ఉంది)

 3 రాజధానులు లేవు..మరి జగన్ వెనక్కి పోయాడా..అబ్బే ఇది మా విజయమే అఁటూ టివిఛానల్స్ 

కుట్రలపూడి శీనులు..పచ్చ బ్యాచ్ చంకలు గుద్దుకోవడానికి ఛాన్స్ వచ్చినట్లేనా..


లేదు బాబూ లేదూ..ఇంకాఉంది..


ఇది ఇప్పటికి తాత్కాలిక బ్రేక్..ఇంకా ఇంటర్వెల్ తర్వాత బొమ్మ బొక్కడుద్దో..దద్దరిల్లుద్దో కానీ

జగన్ మరో సాహసమే చేశాడు..ఎందుకంటే తన వైఖరి అమరావతి పట్ల ఏంటనేది ఇప్పటికే చెప్పేశాడు. ఇక ఇంకోసారి బిల్లుని పూర్తిగా మార్చేసి తెస్తానంటున్నాడు..అంటే అది ఇప్పుడే జరగవచ్చు లేదంటే 2024 తర్వాతా చూడొచ్చు..అంటే ఎన్నికల్లో కూడా కేపిటల్ మార్పుపై 

క్లారిటీతోనే వెళ్లాలనేది అతని ప్లానా


లేక ఇలానే వదిలేసి..కన్భ్యూజన్లో ఎన్నికలకు వెళ్తారా


లేదూ అమరావతి..వైజాగ్, కర్నూలు మూడింటిలోనూ పెద్ద పెద్ద కార్యాలయాలను రాజధానులనే మాట లేకుండా పెడతాడా
 
ఇంకాఉంది

Comments

  1. చంద్రబాబు ఏడుపుని ఎలక్షన్ దాకా మోసుకెల్లాలని చూసిన పచ్చపత్రికలు ఇప్పుడు రాజధానిగురించి మాత్రమే చర్చించాల్సిన స్టేజికి జగన్ తీసుకొచ్చాడు.

    ReplyDelete
  2. మిస్టర్ బీన్ మార్క్ కిచిడీ/బిర్యానీ ఇన్ ఏప్పీ!

    ఇవ్వాళ్టి కొత్తపలుకు చదివాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని అర్ధం చేసుకోవడానికి ఒక క్లూ దొరికింది.తెలుగుదేశం అభిమానులు అనుకుంటున్నట్టు ఆయన తెలివితక్కువ వ్యక్తి కాదు,సైకో అసలే కాదు.మహమ్మద్ బీన్ తుఘ్లక్ వంటి వాడు కూడా కాదు.ఆయనకు ఎదురౌతున్న సమస్యలకు ఆయన కనుక్కుంటున్న పరిష్కారాలు మహమ్మద్ బీన్ తుఘ్లక్త నకు వచ్చిన సమస్యలకు కనుక్కున్న పరిష్కారాల కన్న అద్భుతమైనవి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.అయితే ఆయన ప్రజ్ఞ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ప్రదర్శించని కొత్త తెలివి కూడా కాదు.

    పెద్దలు దీన్ని గురించి "చావు తెలివి" అని ఎప్పుడో చెప్పేశారు.మహమ్మద్ బీన్ తుఘ్లక్కుది చావు తెలివి కాదు.చావు తెలివి ఉన్న మనిషి యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే సమస్యను తనే సృష్టించుకుంటాడు.అప్పుడు అతను తెలివితక్కువవాడిగానే కనిపిస్తాడు అతన్ని అభిమానించి ఆదరించి కీర్తించి తరించేవారికి సైతం!ఆ సమయంలో ప్రతికక్షులు చేస్తున్న విమర్శలని ఎట్లా సమర్ధించుకు రావాలో తెలియని అభిమానులు చాలా నిరాశ పడతారు కూడా - ఎంతటి డైహార్డు ఫ్యానుకి కూడా జెండా పీకేసి ఎగస్పార్టీలో చేరిపోదామా అనిపిస్తుంది.అయితే సరిగ్గా అప్పుడే అసలు వ్యక్తిలోని చావు తెలివి జూలు విదిల్చిన సింహంలా నిద్ర లేచి అభిమానులు సంతసించే ప్రతికక్షులు తిరస్కరించే అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది.ఈ పరిష్కారం యొక్క అసలు సిసలు చమత్కారం ఏంటో తెలుసా - అసలు వ్యక్తి తనకు తను మీద పడేసుకున్న సమస్య అద్భుతమైన రీతిలో పరిష్కారమైపోయి స్వజనులకు ఆనందాన్ని ఇస్తుంది గానీ ఆ పరిష్కారం పక్కనున్న చావు తెలివి లేనివాడికి ఎంత గింజుకున్నప్పటికీ పరిష్కారం దొరకని సమస్య అయి ఛస్తుంది!

    ఇది గందరగోళం అనిపించి అర్ధం కాకపొతే ఒక ఉదాహరణ చూపిస్తాను.Rowan Atkinson అనే మహామేధావి Mr.Bean అనే చావుతెలివి పాత్రను సృష్టించాడు.ఆ పాత్రని అతను తీర్చు దిద్దిన పద్ధతి తెలుసుకోవాలంటే అతనే ఒక ఇంటర్వూలో స్వయాన చెప్పుకున్న విషయం తెలుసుకోవాలి.అతను రోజూ వెళ్లే పచారీ కొట్టు యజమాని ఒకరోజున "మీలో మిస్టర్ బీన్ పోలికలు ఉన్నాయి!" అన్నాట్ట."ఆ పాత్రని చేసింది నేనే!" అని చెప్పుకుంటే,"వూర్కోండి సార్,హాస్యానికి కూడా హద్దులుండాలి.పొలికలు కలుస్తున్నాయి గదాని అలా ఫిరాయించేసుకోమాకండి - బావుండదు!" అని సలహా ఇచ్చాట్ట.

    ఇంతకీ ఆ మిస్టర్ బీన్ చావు తెలివి ఎట్లా ఉంటుందో చెప్పాలి గదా.ఒకసారి మిస్టర్ బీన్ కారుతో పార్కింగ్ ప్లేసు నుంచి రోడ్డు మీదలి రావాల్సి వచ్చింది.అది మనుషులు లేని ఆటోమాటిక్ గేట్.కారు దిగి టోకెన్ పంచ్ చేసి రావడానికి బద్ధకం వేసి ఒక కర్రకి టికెట్ అంటించి స్లాట్ మిషనుని పనిచేయించడం లాంటి అయుడియాలు ఫెయిలయ్యాక మన హీరో శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి లాగే బ్రహ్మాండమాణ ప్లాను వేశాడు.కారును కొంచెం బ్యాక్ చేసి టాప్ గేరులో ఉంచి బ్రేకు మీద కాలేసి తొక్కిపట్టి ఎదురు చూస్తున్నాడు - చావు తెలివి లేని బలిజీవి కోసం.

    బలిజీవి రానే వచ్చాడు.రోడ్డు మీదనుంచి పార్కింగ్ ప్లసెలోకి దూరడానికి ఓక వ్యక్తి టికెట్ పెట్టాడు. లివర్ పైకి లేచింది.మనోడు బ్రేక్ మీదనుంచి కాలు తీశాడు.బీన్ కారు సర్ర్ర్ర్ర్ర్న దూసుకెళ్ళిపోతున్నది.అ బలిజీవి కంగారు పడి తన కారుని వెనక్కి నడిపాడు.బీన్ తన కారుని రోడ్డెక్కించి దూసుకుపోయాడు.ఈ బలిజీవి తన కారుని వెనక్కి నడుపుతాడని తెలీక అదే రోడ్డు మీద తన దారిన తను పోతున్న మరొక బలిజీవి అసలు బలిజీవి కారుని గుద్దేశాడు."బంతీ చామంతీ ముద్దాడుకున్నాయి!" మ్యూజిక్కు ఏస్కొండి మీ మైండులో. బీన్ మాత్రం కారు విండోనుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూసి తన సమస్య పరిష్కారమైందన్న సంతోషాన్నీ ఎక్కూవసేపు అక్కడుంటే వాళ్ళీద్దరి వల్ల తనకి ప్రమాదం అని తెలిసిన భయంతో కూడిన జాగ్రత్తనూ తన ముఖకవళికలలో చూపిస్తూ రయ్యిమని దూసుకుపోయాడు.

    ఇటువైపునుంచి చూస్తున్న మనం గానీ తన చావుతెలివికి బలయిన ఇతర్లు గానీ ఎంత నవ్వుకున్నా ఎన్ని తిట్టుకున్నా బీన్ లెక్క చెయ్యడు,"తొక్కలే!ఈ పిచ్చొళ్ళని పట్టించుకుంటే మనకి గిట్టుబాటు ఎట్టా అవ్వుద్దీ?" అనేసుకుని నవ్వుకుంటాడు - అచ్చం శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి లానే.అతన్ని అభిమానించి ఆదరించి కీర్తించి తరించేవారిది సైతం అదే మూస.ఆయన్ని "మహమ్మద్ బీన్ తుఘ్లక్ వంటి వాడు కూడా కాదు" అని ఎందుకు అన్నానో ఇప్పుడు అర్ధమై ఉండాలి.

    జై శ్రీ రాం!

    ReplyDelete
  3. "రాజధానిగురించి మాత్రమే చర్చించాల్సిన స్టేజికి జగన్ తీసుకొచ్చాడు." అంటున్నారు,అసలు రాజధాని అనేది ఎక్కడుంది?అసలు లేని రాజధాని గురించి ఎవరు చర్చిస్తారు?మూడు రాజధానుల బిల్లుని రద్దు చెయ్యడం అంటే అంతకు ముందరి స్థ్తికి వెళ్ళినట్టే.అప్పుడు రాజధాని అమరావతియే అవుతుంది కదా, ఇంక చర్చించాల్సిన అవసరం ఏమిటి?

    మళ్ళీ సమగ్రమైన బిల్లు పెట్టేవరకు సాంకేతిక పరమైన రాజ్యాంగ నియమావళి ప్రకారం అమరావతియే రాజధాని.వేరే పేరుతో CRDA పునరుద్ధరణ కూడా జరిగిపోయాక దేని గురించి చర్చించాలి.

    ఫ్యాక్షనిస్టు ఎకనామిక్సు ప్రకారం ఇక్కడ తను కబ్జా చెయ్యడానికి భూములు మిగిలి లేవు కాబట్టి కబ్జాలు చెయ్యడానికి వీలున్న విసాఖని ఎంచుకుని ఆక్రమించుకున్నాడు.అక్కడ కూడా తన పని పూర్తైపోయింది.ఆంధ్రా అక్కుపక్షులకి రాజధానీ అక్కర్లేదు అభివృద్ధీ అక్కర్లేదు.జగనుకి 151/175 సీట్ల ఘనవిజయాన్ని ఇచ్చినప్పుడె ప్రజలు జగను ఏం చేసినా భరించడానికి సిద్ధపడినట్టు తేలిపోయింది కదా!అలాంటప్పుడు అతనికి తోచిందే చేస్తాడు, లేదంటే ఏసుక్రీస్తు గారో వాళ్ళ నాన్నారో చెప్పింది చేస్తాడు.ప్రజలకి అతను ఏది ఇస్తే అది తీసుంకెవడం తప్ప మరో దారి లేదు.

    కాబట్టి ఇదీ ప్రపంచం బ్లాగరు గారు తను వూహించుకుని భ్రమపడుతూ ఇతరుల్ని వూరించడానికి ప్రయత్నిస్తున్న "ఇంకాఉంది..ఇది ఇప్పటికి తాత్కాలిక బ్రేక్..ఇంకా ఇంటర్వెల్ తర్వాత బొమ్మ బొక్కడుద్దో..దద్దరిల్లుద్దో కానీ ఇలానే వదిలేసి..కన్భ్యూజన్లో ఎన్నికలకు వెళ్తారా,లేదూ అమరావతి..వైజాగ్, కర్నూలు మూడింటిలోనూ పెద్ద పెద్ద కార్యాలయాలను రాజధానులనే మాట లేకుండా పెడతాడా..ఇంకాఉంది" అనే దృశ్యానికి ఆస్కారమే లేదు.రాజధాని పేరుతో గానీ అభివృద్ధి పేరుతో గానీ ఒక్క కొత్త భవనం కూడా కట్టడు, కట్టలేదు, కట్టబోదు,కట్టాలని అనుకోవడం లేదు.

    ప్రస్తుతం జగన్ చేస్తున్నది వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిశోరుకీ వోటర్లకీ ఇవ్వడానికి సరిపోయేటంత సొమ్ముని ఖజానా నుంచి వెనకెయ్యడం, అంతే!

    ReplyDelete
    Replies
    1. ప్రతిరోజూ ఎదోఒక వంకపెట్టుకోని.. చంద్రబాబు ఏడుపును ప్రచురించే పత్రికలదృష్టి చచ్చినట్టు రాజధానివైపు మల్లేలా చేశాడు అన్నానేగానీ.. రాజధాని తప్పా, ఒప్పా అని అనలేదు. ఒక రాజధాని కరెక్టా?, మూడూ రాజధానులు కరెక్టా? ఆచర్చ తర్వాత పెట్టుకుందాం.

      Delete
    2. "రాజధాని తప్పా, ఒప్పా అని అనలేదు. ఒక రాజధాని కరెక్టా?, మూడూ రాజధానులు కరెక్టా?" అని నేనూ చర్చించడం లేదు.

      తొలిసారి జగన్ మూడు రాజధానుల ప్రస్తావన్ తెచ్చినప్పుడే రాజ్ధాని గురుంచిన రాగ్డ మోద్లైంది.అమరావతి రైతుల యాత్ర ఎప్పటినుంచో జరుగుతున్నది.కోర్టులో విచారణలూ అ అవార్తలూ రెండు రోజులకో మూడు రోజులకో వస్తూనే ఉన్నాయి.

      చంద్రబాబు ఏడుపుకి ముందు కూడా రాజధాని గురించిన వార్తలు వస్తూనే ఉన్నప్పుడు జగన్ "బిల్లు సమగ్రంగా లేదు, వెనక్కి తీసుకుంటున్నాను" అన్న ప్రకటన తర్వాతనే రాజధాని గురించిన చర్చ మొదలైతే గదా "చంద్రబాబు ఏడుపుని ఎలక్షన్ దాకా మోసుకెల్లాలని చూసిన పచ్చపత్రికలు ఇప్పుడు రాజధానిగురించి మాత్రమే చర్చించాల్సిన స్టేజికి జగన్ తీసుకొచ్చాడు" అని మీరనటం నిజమయ్యేది అంటున్నాను నేను.

      Delete
    3. ఆ ప్రకటన ముందురోజు వరకూ.. ఆంద్రజ్యోతి.. చిన్నపిల్లని కూడా వొదలకుండా గిల్లి మరీ "చంద్రబాబు తాతయ్య ఏడుస్తుంటే.. నాక్కూడా తెగ ఏడుపొచ్చేసిందీ" లాంటివి రాసుకెల్తూ, తెదేప వాల్లు ప్రతిరోజూ ఏదోఒకచోట ఓ పదిమందిగూడి.. "బంధు చేసేశాం.. సూపర్ సక్షెస్" అని పచ్చపత్రికల్లో (వ్యాపార) ప్రకటనలిచ్చుకోడం చేసేవారు. జగన్ ఒక్కప్రకటనతో.. ఈరోజు వరకూ దానిగురించి మాట్లాడితే ఒట్టు. బునుగుబాచ్చికి మత్రం అదే ఏడుపు.. సోషల్ మీడియాలో కామెడీగా తెగవాడేసుకోడానిగి ఉపయోగపడింది.

      Delete
    4. అమరావతి రైతుల పాదయాత్ర ఎప్పుడు మొదలైంది సార్!"జగన్ ఒక్కప్రకటనతో.. ఈరోజు వరకూ దానిగురించి మాట్లాడితే ఒట్టు." అని మీరు 11 December 2021 at 04:50 నాడు అనడాన్ని బట్టి అమరావతి రైతుల పాదయాత్ర ఇప్పటికీ మొదలు కాలేదేమోనని అనుమానం వస్తున్నది నాకు!

      ఏదో కసి కొద్దీ ఒక పొరపాటు కామెంటు వేశారు,ప్రమాదో ధీమతామపి అని సరిపెట్టుకోండి!ఒక తప్పును కవర్ చేసుకోవడానికి మరో తప్పు చేస్తూ పోతే ఎలా సార్?

      Delete

Post a Comment