స్వేఛ్చ లభించి నేటికి ఏడాది..అద్భుతమైన నిర్ణయం తీసుకున్న రోజిది..( పర్సనల్ )

 


మనసు చెప్పిందా...మైండ్ చెప్పిందా..గుండె చెప్పిందా కాదు..మనకి నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందం, సంతోషం సుఖం..ఇలాంటి ఎన్ని పాజిటివ్ వర్డ్స్ అయినా సరే..అలాంటి నిర్ణయం తీసుకుని నేటికి ఏడాది పూర్తైంది.


ఉన్న ఉద్యోగం వదిలేయాలంటే గట్స్ కావాలి..అది కూడా నెలాఖరులో చెప్పి మరీ వదిలేయాలంటే మరీ గట్స్ కావాలి. అది కూడా నీ జీతం ఇదిగో వచ్చే నెల నుంచి ఇంత పెరుగుతుంది అని చెప్పిన తర్వాత వదిలేయాలంటే..!


అలా నేను నవంబర్ 29న నే చేస్తున్న ఛానల్‌కి గుడ్‌బై చెప్పేశా..! ఆ క్షణం నుంచి నేటి వరకూ ఏ ఒక్క క్షణం కూడా ఆ నిర్ణయంపై కించిత్ కూడా బాధ కాదు కదా..ఆలోచన కూడా చేసింది లేదు..ఎంతో హ్యాపీగా..చాలా ఆనందంగా ఉన్నా...


తొక్కలో బాసుల మైండ్‌లెస్ ఆజ్ఞలు..సూడో మేధావులకి సలాంలు..మస్కా కొట్టే నమస్కారాలు అంటే ఈషణ్మాతం పడవు నాకు ..అందుకే ఇలా ఉన్నా...( ఎవడెలా అనుకున్నా) అసలు తలుచుకుంటేనే గర్వంగా ఉంది..శబ్భాష్ రా..ఇదిరా మనమంటే అని చూపించుకున్న నిర్ణయం ఇది..హోదా ముసుగులో  (అ)జ్ఞానాన్ని ప్రదర్శించే వెధవాయల సంస్కారానికి చెంప దెబ్బలా రాజీనామా చేసి రావడం అంటే..మనకంటూ ఓ చరిత్ర మిగుల్చుకున్నట్లే


నే పని చేసిన చోట( ఆ మాటకి వస్తే ప్రతి చోటా ఇలానే ఉంటుందనే ఆషాడభూతులకు కళ్లు ఎప్పటికీ తెరుచుకోవు) అక్షరమ్ముక్క రానోడు మహా మేధావి..ఏ పదం దేనికి రాస్తాడో తెలీనోడికి అరలక్ష జీతం..ఇంకా బాసుకు జై కొడితే హైకులు..ఇలాంటివి మనకి అవసరమా



ఎవడో అన్నట్లు..సింహాల చరిత్ర సింహాలే రాయాలి..లేకపోతే ప్రతి గుంటనక్కా చెప్పిందే కథలవుతాయ్..ఎవడేం చెప్పినా వినొద్దు..మనిషి మాట అసలే వినొద్దంటే కరెక్టే కదా..బొచ్చెడు చెప్తారు..ఏదో మనకి శ్రేయోభిలాషులన్నట్లు బిల్డప్ ఇస్తారు.బతిమాలుతూ బెదిరిస్తారు..మనం కానీ ఆ క్షణంలో వాళ్ల మాట విన్నామా..కట్టుబానిసలుగా ఆర్థిక తాబేదార్లుగా మిగిలిపోవాల్సిందే


ఈ లోకంలో బతకడానికి బోలెడు దారులు..పెతోడూ...ఏ విదేశాల్లోనూ..చేసే ఉద్యోగాలే చేయక్కర్లేదు..దొంగతనం, జూదం, మోసం చేయకుండా ఎలాంటి పనైనా చేసుకోవచ్చు..కాదని ఎవడైనా వాదిస్తే చెప్పు తీసుకుని కొట్టినట్లు సమాధానం చెప్పాలి..వాడు వాడికి అనువైన కన్వీనెంట్ వాదనని ముందుకు తెచ్చుకుని వాడి బతుకే సూపరని నమ్మబలుకుతాడు..కనీసం వాడైనా నమ్ముతాడో లేదో కానీ..అందుకే...


మన జీవితం మన చేతుల్లో..మనమే బాస్.. ఈ డైలాగ్ చెప్పినోళ్లు కూడా మనపై జులుం చేసేందుకు అజమాయిషీ కోసం..కాస్త వంగి ఉండు గురూ నీ జీతం ఓ పదివేలు పెంచుతామంటూ ( వాళ్ల ఈగో శాటిస్ ఫై చేసుకోవడానికి) ఫీలర్లు ఇస్తారు.



చివరిగా ఒక్క మాట..అందరికీ ఇలా కుదరొద్దూ అని ఎవడైనా నసుగుతున్నాడంటే..వాడు నిత్యశంకితుడు..ఏ స్టెప్పూ వేయలేనోడనే..


.కానీ...మన జీవితం మనదే..దమ్ముండాలి..ధైర్యం ఉండాలి..బతకడానికి..ఇష్టం వచ్చినట్లు కాదు..ఇష్టమైనట్లుగా బతకడానికి..


Comments

  1. Congrats on your first real birthday

    ReplyDelete
    Replies
    1. ఇదేం కొత్త కాదు బ్రో...కాకపోతే..ప్రతిసారీ ఇలా ఉండేది కాదు..ఇది కాకపోతే ఇంకో ఛానల్ అంటూ వెళ్లేవాడిని..ఈసారి ఏ ఛానల్ జోలికీ పోలేదు

      Delete

Post a Comment