ఎవరీ కేతిగాడు..నిజంగా వీరగ్రంధ్ తీసేంత సీన్ ఉందా







ఇతగాడి  పేరే కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి..ఏకంగా 6 భాషల్లో సినిమా తీస్తున్నానంటూ  అటు జనాన్ని..ఇటు లక్ష్మీపార్వతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..నిజంగా మనోడికి అంత సీనుందా అంటే..పొట్టచెక్కలయ్యేట్లు నవ్వుకోవాల్సిందే
..ఎందుకంటే..ఇతగాడి పూర్వాశ్రమం గురించి తెలిసినోళ్లకి మరి నవ్వు రాక ఏం చేస్తది..గతంలో పద్మాలయాస్టూడియోలో ఈయనగారు కెమెరా డిపార్ట్ మెంట్ చూస్తుండేవాడు..అలానే
కామాగ్ని అనే పేరుతో ఓ సినిమా కూడా తీశానంటాడు..తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ అది రిలీజ్ కాలేదు. పైగా ఆ సినిమాకి డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ తేజ..అప్పటి పేరు ధర్మతేజ..వరసగా హిట్లిచ్చి..ఇప్పుడు సోదిలే లేకుండా పోయాడే..ఆ తేజానే  ఈతేజ..ఓకే ఇదీ మనోడి ఫ్లాష్  బ్యాక్..

ఇప్పుడేం చేస్తున్నాడంటారా..! సెలబ్రెటీలతో ఫోటోలు దిగడం.


.ఏదోక హడావుడి చేస్తున్నట్లు ఫోటోలు పెట్టడం చేస్తుంటాడు..తమిళనాడులో తెలుగుయువశక్తి అంటూ ఓ ఆర్గనైజేషన్ ఉందంటాడు..అటు పన్నీర్ సెల్వంని కలుస్తాడు..వీలున్న ప్రతి చోటా ఓ ఫోటో తీసుకుంటాడు..హైదరాబాద్ వచ్చినప్పుడు న్యూస్ ఛానల్స్ లో తనకి తెలిసినవాళ్లకి ఫోన్లు చేసి స్క్రోలింగ్స్ పెట్టమంటాడు.

 ఇదీ ఇతని స్టైల్..మరి ఇతనికి కనీసం ఓ షార్ట్ ఫిల్మ్ చేసే శక్తి కూడా లేదని స్నేహితులు చెప్తుంటారు..అలాంటిదిఏకంగా 6 భాషల్లో అంటే...పడి పడి నవ్వాల్సిందే.. అన్నట్లు కొన్నేళ్ల ముందుి ఈయన తీసిన కామాగ్నిని యుట్యూబ్ లో 6లక్షలమంది చూశారట..అందుకని హాలీవుడ్ వాళ్లే యీయన వెంట పడి బతిమాలాడి మరీ ఇంగ్లీష్ కూడా తీయమన్నారట..అదిగో ఎందుకు నవ్వుతున్నారు..దానికి సంబంధించిన లింక్ ఇదిగో చూడండి
http://yagnamurthy.blogspot.in/2011/10/kamagni-movie.html


చూశారా..అనవసరంగా ఈ మాత్రందానికి లక్ష్మీ పార్వతి ధర్నా చేయడం...వర్మ ఏమో ఇతగాడి పోస్టర్‌కి ట్వీట్ చేయడం అవసరమా...!
ఇది వైెఎస్ చనిపోయిన మూడో ఏడు ఆయనగారిచ్చిన ప్రకటన..అర్ధమైందా..కేతిరెడ్డిగారి సినిమాలో ఇక ఏపాటి సీరియస్ నెస్ ఉందో!

Comments