ఎందుకు చావాలసలు?


ఆత్మహత్యలు..ఈ పదం వింటేనే పరమ చిరాకు..అసలు చచ్చిపోయేంత ధైర్యం ఉంటే బతకడానికి ఎందుకు వెనుకాడుతున్నారు. జీవితంలో బతకడం కంటే  ఎక్కువ ఇంకేదీ కాదు. సమాజంలో మెసలడానికి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. ఫాలో అయ్యేవాళ్లు అవుతారు.. లేనివాళ్లు లేదు. కానీ ఇలా చనిపోవడం ఏంటని
ఇప్పటికిప్పుడు ఈ జ ాడ్యం ఎక్కడ చూసినా అంటుకుపోయింది. అటు చంపేసే బ్యాచ్ అంటూ పేరున్న డిపార్ట్‌మెంట్‌ మనుషులూ ఇలా సూసైడ్లు చేసుకుంటున్నారంటే మొత్తం సమాజానికే కౌన్సిలింగ్ కావాలా లేక, నిజంగా వాళ్లెదుర్కుంటోన్న సమస్యలు అంత బలమైనవా..బిటెక్ ఫైనలియర్ స్టూడెండ్ సూసైడ్ ఇప్పుడు బ్రేకింగ్ అవుతోంది..పేరనవసరం..అమ్మాయి..వెంటనే సవాలక్ష సందేహాలు..ఎవడి ఒపీనియన్ వాడు గాల్లోకి వదలడం..అసలు చనిపోవడం కంటే ఇలాంటి కామెంట్లకి ఇంకోసారి చస్తారనిపిస్తుంది..ఎందుకు చావాలసలు? ఏం కోల్పోయినా...ప్రాణం ముఖ్యం..అంటే నీతిని విలువలను వదిలేసి బతకమని చెప్పడం లేదు..కానీ..ఏదో ఆశించినది జరగనంత మాత్రాన చనిపోవడం ఏంటని...ఐతే ఇవన్నీ నిజంగానే సూసైడ్లా...లేక కన్వీనెంట్‌గా సొసైటీ చేస్తోన్న మర్డర్లా...!

Comments