గుడి యెనక నా సామి


రక్తి..భక్తి..ఆపైనే ముక్తి..ఇదీ సన్యాసాశ్రమానికి గృహస్థు వెళ్లాల్సిన తీరుగా చెప్తుంటారు..ఐతే సన్యాసత్వాన్ని స్వీకరించినంత మాత్రాన..సన్నాసులమేం కాదనుకుంటారో ఏంటో కానీ..కొంతమంది కాషాయాంబరులు..తమ రసికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇవి లోలోలప జరిగినంత కాలం పెద్దగా ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ..బైటపడిందంటే నాసామి రంగా..ఇంక తిరనాళ్లలో కుక్క గతే..ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు..
నిత్యానందసామి...ఆశ్రాం బాపూ నుంచి రీసెంట్ డేరాగాడి వరకూ తమ గోకుడు బుద్దితో జనం ముందు పలచనైనవాళ్లే.! ఐతే వీళ్లలో డేరాగాడు మరీ పెట్రేగి పోయి..మర్డర్లు కూడా చేయడంతో మనోడికి ఎవడూ సింపతీ కూడా సూపించడం లేదు.. ఇప్పుడలాంటి స్టోరీనే కర్నాటకలో బైటపడింది..అదేంటో కానీ...ఎక్కువ ఇలాంటి రసిక శిఖామణులు ఎక్కువ అక్కడే బైటపడుతుంటారు..తాజాగా నంజేశ్వర ఉరఫ్ దయానంద్..(స్వామి)  ఓ 
యాక్ట్రెస్‌తో కామపూజలు చేస్తుండగా వీడియోకి చిక్కాడట..నాకు తెలిసి ఎవరూ వీడియోకి కావాలని చిక్కరు..ఎవరో
ఫిక్స్ చేస్తే తప్ప..ఏదీ మన రేవంత్  రెడ్డిని స్ఠీఫెన్ ఫిక్స్ చేసినట్లు..మరి వీడియో బైటకి వచ్చిన తర్వాత ఇక
గొడవ రేగకుండా ఎలా ఉంటది..అదే జరుగుతుందిప్పుడు మరి..పాపం కన్నడ ఛానళ్లన్నీ మనోడిని అరగంటల పాటు ఆడించి పారేస్తన్నాయ్.



Comments