బాలయ్య తనకి తానే అవార్డు ప్రకటించుకున్నాడా..! పంచేసుకున్నది నిజమేనా?




నంది అవార్డులు ఇక లేవేమో అనుకున్న తరుణంలో ఎకాఎకిన ఏకంగా మూడు సంవత్సరాలకు ఒకేసారి ప్రకటించేశారు కమిటీ సభ్యులు..ఎంత ఫాస్ట్‌గా అనౌన్స్ చేశారో..అంతే వేగంగా కామెంట్లు కూడా వచ్చేశాయ్. గతంలో అంటే పెద్దగా పట్టించుకునేవారు కారేమో కానీ,  ఇప్పుడు మాత్రం ఫేస్‌బుక్ లాంటి వేదికలు ఉండగా..ఇక విమర్శలకు లోటేముంది..వాటిలో కొన్ని చూస్తే..
                                     తన అవార్డు తానే ప్రకటించుకున్న బాలయ్య
                         అంతా వాళ్లోళ్లకే ఇచ్చేసుకున్నారు బాస్
                        భలే పంచేసుకున్నారులే ..ఫ్యామిలీలకు ఫ్యామిలీలు 
ఇలాంటి కామెంట్లు బోలెడు..నిజానికి తన సిినిమా పరిశీలనలో ఉందన్నప్పుడు బాలయ్య కమిటీ నుంచి తప్పుకోవాల్సింది కానీ.. ఆపని చేయలేదు..గతంలోనూ ఇలానే జరిగినప్పుడు నాట్ ‌బిఫోర్  అంటూ జ్యూరీ నుంచి తప్పుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయ్. 

సరే ఇక విమర్శలే చేయాల్సి వస్తే, లెజెండ్ అనే సినిమా పూర్తి రక్తపాతంతో కూడుకున్న సినిమా అది అత్యంత ప్రజాదరణ కేటగరీ కింద ఇస్తే ఎవరికీ ఏ నొప్పీ ఉండదు..ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా హింసను ప్రోత్సహించడం, చిన్నారులపై దాడి ఘటనలు..అలానే మనోభావాలను దెబ్బతీసే చిత్ర ఇతివృత్తాలు కలిగిన సినిమాలకు అవార్డులు ఇవ్వదు..ప్రోత్సహించదు..కానీ ఈ సినిమాలో చూస్తే ఎక్కడిక్కడ కాళ్లు నరకడం..ఓ క్యారెక్టర్‌ని విలన్లలో ఒకడు రేప్ చేసిన తీరు..ఇంకా చాలా చాలా సన్నివేశాలు ఖచ్చితంగా అభ్యంతరకరమైనవే! అలానే ఈ సినిమా డైరక్టర్‌కి  బిఎన్ ‌రెడ్డి అవార్డు ఇవ్వడమంటే చచ్చిపోయి ఆ దర్శకుడు బతికిపోయాడనుకోవాలి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల్లో ఓ సన్నివేశంలో " హీరోయిన్ నేను స్నానం చేస్తున్నా వచ్చి కూర్చోండి|" అనే  డైలాగు ఉంటే..ప్రేక్షకుడు మదిలో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయో అని ఆ సన్నివేశాన్నే తొలగించిన వ్యక్తి( హీరోయిన్ నగ్నంగా ఉందనే విషయం ప్రేక్షకుడు ఊహిస్తాడు అలా ఎందుకు చేయాలి అని) అలాంటి డైరక్టర్ పేరిట ఇచ్చే  అవార్డు..లెజెండ్ లో హీరోయిన్ ఓపెనింగ్ సీన్ చూస్తే( హాలీవుడ్ మూవీలో ఉర్సులా ఆండ్రోస్ బికినీలో ఎంట్రీ ఇచ్చే సన్నివేశాన్ని ఎత్తి పెట్టాడు) ఎలా ఇస్తారనిపించకమానదు..జ్యూరీ నిర్ణయం కాబట్టి..మా అవార్డులు మా ఇష్టం అనగల సమర్ధులు కాబట్టి వదిలేయడమే..బాలకృష్ణ, హరికృష్ణ మనవడు.., జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, గౌతమ్ కృష్ణ, కృష్ణంరాజు, ప్రభాస్, మంచు లక్ష్మి, నాగ చైతన్య,  రాఘవేంద్రరావ్, చిరంజీవి,నాని, నరేష్, జయసుధ..ఇలా మనోళ్లనుకునేవాళ్లకే  ఇచ్చారనే కామెంట్లు కోకొల్లలు..ఏదో కంటితుడుపుగా అన్నట్లు..హితుడు, అర్ధనారి, మనలొ ఒకడుని వాడుకున్నట్లు కన్పిస్తుంది..

ఈ కామెంట్లలో ఎక్కువశాతం నిజమే ఉంది..ఐతే మనోళ్లైనంత మాత్రాన( ఇక్కడ మనోళ్లు అంటే ఏదోక కులం   అని మాత్రమే భావించవద్దు..మనకి దగ్గరైన, నిరంతరం టచ్ లో ఉండే..మనతో బావుండేవాళ్లని అర్ధం)  ప్రతిభ లేదనడం కూడా సరికాదు..కాబట్టి వీరిని నందులు చేరాయనుకోవచ్చు..కానీ కేటగరీలు మార్చి ఇచ్చినట్లైతే వాటికి సార్ధకత చేకూరేది..ఎందుకంటే గతంలోనూ ఇలానే లాహిరిలాహిరి లాహిరిలో అనే సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు కీరవాణి..ఐతే ఆయనకి నంది అవార్డు దక్కింది మాత్రం ఒకటో నంబర్ కుర్రాడుకి..బూతులతో ఓ పాట కూడా ఉంటుందందులో..పాపం కీరవాణికే  ఆ సినిమాకి అవార్డు ప్రకటించడం షాక్ గా ఉందని చెప్పుకున్నాడు..ఇదివరకు రీమేక్ సినిమాలకు అవార్డులు ఇచ్చేవారు కాదు..కానీ ఆ తర్వాత తర్వాత వాటికీ ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఉత్తమ డాక్యుమెంటరీ, ప్రజాపయోగ్య, విమర్శనాత్మక అంటూ ఇచ్చే కేటగరీలు ఎవరు నిర్ణయిస్తారో తెలీదు..ఆ విభాగాలకు ఎన్ని ఎంట్రీలు వచ్చిందీ కూడా తెలిపి ఆ తర్వాత పురస్కారాలు ప్రకటిస్తే..వాటి బండారమూ బైటపడుతుంది. ఇంకా   డీప్ గా వెళ్లి చూస్తే ఈ లిస్టులో కూడా రీమేక్ సినిమాలు కన్పించవచ్చు. విమర్శల  సంగతి పక్కనబెట్టేసి.. ఏదేతైనేం ఇంత మంది నటులను ఒకేవేదికపై ఒకేసారి అమరావతిలో చూడబోతున్నాం అని సరిపెట్టుకుందాం

Comments