ఆ పెద్ద తలకాయ గుర్నాధరెడ్డేనా అచ్చెనాయుడూ!


"ఓ పెద్ద తలకాయను లాగేసేందుకు ట్రయల్స్ వేస్తున్నాాం రెండ్రోజుల్లో ఖాయమైపోతుంది..దీంతో వైెస్సార్సీపీ ఖాళీ..ఇక జగన్..ఆయన తల్లిగారు, చెల్లి మాత్రమే పార్టీలో మిగులుతారు"
ఇవీ అసెంబ్లీ లాబీల్లో మంత్రి అచ్చెనాయుడు మాటలుగా ప్రచారం అవుతున్నవి..వీటికి బలం వచ్చేలా ఇవాళ లాబీల్లో గుర్నాధరెడ్డి వచ్చి సిఎంని కలిశారనే న్యూస్ గుప్పుమంటోంది..పార్టీలో చేరితే నేను ఊరుకోనంటోన్న ప్రభాకర్  చౌదరి ఈపాటికే చంద్రబాబుని కలిశారు. ఐతే బాబు ఎంత చెప్పినా ప్రభాకర్ చౌదరి వినలేదని టాక్

ఐతే మాజీ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తన అభివృధ్ది చూసే పార్టీ మారతున్నారని చంద్రబాబు చెప్పుకోవడానికే ఈ చేరిక ప్లానేసినట్లు అంటున్నారు. పైకి ఏది చెప్పినా దీంతో అనంతపురం రాజకీయాల్లో ప్రత్యేకించి టిడిపిలో మరో ముసలం ఖాయంగా కన్పిస్తోంది..ఎందుకంటే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరి, పయ్యావుల కేశవ్,  ఇప్పుడు గుర్నాధరెడ్డి ఇలా నాలుగు బొంగుల టెంటులో ఎవరు ఎటు లాగినా..టెంటు కూలిపోతుందని..ఇది ప్రస్తుతానికి బలుపులా కన్పించినా, 2019 ఎన్నికల సమయంలో మాత్రం పార్టీకి నష్టం చేకూరుతుందని టిడిపి కార్యకర్తల ఆందోళన.

అసలే టిడిపిలో జేసీ కామెంట్లు మితిమీరడంతో పార్టికి కావాల్సినంత చెడ్డపేరు వస్తుంటే..ఇప్పుడు కొత్త చేరికతో ప్రభాకర్ చౌదరి కూడా తన సీటుకు ఎసరు పెడతారేమో అని గుబులు పడుతున్నాడు. ఈ ఒక్క చేరికే, పార్టీ ఫేట్‌ని మార్చితే ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా టాక్

Comments