సో...ముసుగు తొలిగిపోయింది పవన్ టార్గెట్ క్లియర్


మూడు రోజుల పరామర్శ,ఓదార్పు యాత్ర కాస్తా...టిడిపికిభరోసా యాత్రగా పవన్ మార్చేశాడనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయ్..ఎందుకంటే..టిడిపికి బాగానే చురకలు వేసినట్లు కన్పిస్తున్నా..ప్రతి చోటా వేరే ఆప్షన్ తనకి లేదు...జనానికి లేదుఇక చంద్రబాబే దిక్కన్నట్లుగా ప్రసంగాలు సాగాయ్..సమయంలేదు సందర్భం లేదు..పరకాల ప్రభాకర్‌పై సెటైర్లు వేసి చప్పట్లు కొట్టించుకోవడం సరే కానీ...హోదా ఖచ్చితంగా రావాలి..ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని అడిగిన చంద్రబాబునాయుడే..స్వయంగా"  ఇప్పుడు హోదాతో ఏంరాదు...అసలు వీళ్లకేం తెలుసు...హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయో తెలుసా...ఏం మాహటాడుతున్నారు."అంటూ కళ్లెర్ర జేస్తుంటే...ఆయన్నివదిలేసి గడ్డిపరకలాంటి పరకాలపై అరుపులు ఎందుకు వేస్తున్నావ్ మిత్రమా...! 

మీకు తెలుసో లేదో కానీ...ఏపి సిఎంఓలో మీడియా సలహాదారుగా జాయినైన ఈ పెద్దమనిషిని కొంతమంది తాబేదార్లు బండబూతులు తిడతారట..ఓ కేంద్రమంత్రికి భర్త అయి ఉండి కూడా అలాంటి దీనస్థితిలో ఉన్నవాడిపైనెందుకు ఇంత కోపం..సరే ఈ సంగతి వదిలేద్దాం

 ఏ ప్రసంగం మొదలెట్టినా జగన్ పదవి ఇస్తేనే పని చేస్తా అనడం మీకు నీచంగా ఎఁదుకు కన్పిస్తుందో తెలీడం లేదు..ఆఖరికి కాపు రిజర్వేషన్లను మీరు పోరాడితేనో...ముద్రగడ ఉద్యమాలు చేస్తేనో రాలేదు..(వాటిని తక్కువ చేయడంలేదు) అంతిమంగా జీఓలు..తీర్మానాలు చేయాల్సింది అధికారపక్షమే..అలాంటివి చేయాలన్నా..పదవి కావాల్సిందేకదా..అక్కడికేదో పదవులు మీకొద్దు అనేవాళ్లు...మీ ప్రసంగాల్లో చిరంజీవి సిఎం అయ్యేవారు..చిరంజీవిని మోసం ఛేశారు అంటున్నారు కదా...అంటే మీకు మాత్రం పనులు చేయాలంటే పదవులు కావాలి...ఇతరులు మాత్రం ఎప్పటికీ ప్రతిపక్షంగానే ఉఁడాలా..ఇదే అర్ధమవుతోంది మీ వాదన చూస్తే..అంటే...మీ ముసుగు పూర్తిగా తీసేశారన్నమాట...పనులు కావాలంటే ఒకటి టిడిపి చేయాలి, లేదంటే ఏ లాభాపేక్షా లేని పవన్ కల్యాణ్ చేయాలి..అంతేకానీ..ఇకఇంకో పార్టీకి అడిగే హక్కుకూడా లేదన్నమాట..అందుకే మీ ఓదార్పు యాత్ర టిడిపికి భరోసా యాత్రగా మిగిలిపోయింది

Comments