ఆత్మస్తుతి పరనింద..వెరసి అయోమయం ! పవన్ ఇక నీ తీరు మారదు


"ఎక్కడనుంచైనా పోటీ చేసి గెలవగలను..కానీ పోటీ చేయను..సిఎం అయితేనే పరిష్కరిస్తా అనే మాటలు నచ్చవ్..కానీ జగన్ కూడా డిసిఐకి మద్దతివ్వాలి..నాకు మోడీ,బాబు బంధువులు  కాదు.."

" హోదాని సాగదీస్తోంది...వైసీపీ అవినీతి చేసింది..అందుకే వ్యతిరేకించా..! చంద్రబాబు వాడుకుని వదిలేస్తారు..నాకు తెలీదా..? ఫదవి కాదు ముఖ్యం" 
ఇలాంటి డైలాగులతో పవన్ కల్యాణ్ బాబు బాగానే రంజింప జేశాడు..కానీ ఈ టూర్ ముఖ్య ఉద్దేశం ఏంటో ఎవరికైనా గుర్తుందా..కేవలం ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించడం.. 
అసలు ఇంతవరకూ పోటీనే చేయనివాడు సిఎం ఎలా అవుతాడు..అది కూడా  తెలీకుండా నినాదాలు చేసేవాళ్లని ఫ్యాన్స్ అని మాత్రమే అంటారు..ఇక వైఎస్ జగన్ పై చేసిన కామెంట్  తండ్రి చనిపోయిన తర్వాత వెంటనే సిఎం అవ్వాలనుకోేవడం ..ప్రూవ్ చేసుకోవాలట..ఇప్పుడు జగన్ సత్తాతెలిసి కూడాా   ప్రూవ్ చేసుకోవాలని ఎలా అంటాడు పవన్ మీ అన్నగారు  పోటీ చేసిన ప్రజారాజ్యానికి ఎన్ని సీట్లు దక్కాయోతెలుసా..గుర్తుందా...మరి ఆయనకే అంత తపన ఉంటే..158 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి మరీ జగన్ ని సిఎఁ చేస్తామంటే  మీనమేషాలు లెక్కెడతారా...ఓకే వదిలేద్దాం...మరి మీ అన్నగారు ఏం ప్రూవ్ చేసుకున్నారని కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. మరి ఇంత కీన్‌గా పాలిటిక్స్ అబ్జర్వ్ చేసే మీరు..జగన్‌పై సిబిఐ ఎంక్వైరీ కానీ..కేసులు పెట్టడం కానీ ఎలా ఏ నేపధ్యంలో జరిగాయో ఎందుకు చెప్పరు? ప్రసంగమంతా ఇతరులపై విమర్శలు చేయడం తప్ప మీరు చూసిన సమస్యలకు మీరేదైనా పరిష్కారం చెప్పగలిగారా..? ఇంకో విషయం నోట్లరద్దు,జి ఎస్‌టి పైన ఆయన అభిప్రాయం ఎప్పుడో చెప్పారట..ఎవరికి  ఏం చెప్పారు మీరు..అసలు వాటివలన కలిగిన నష్టాలేంటో  మీకు నిజంగా తెలుసా? మీ పిఆర్ హరిప్రసాద్ దీని గురించి మీకు ఏం చెప్పమని చెప్పాడు సర్!
ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు వచ్చి నాలుగు డైలాగులు చెప్పి పోయే మీకు అసలు పోటీ చేసే హక్కు ఉందా.. మాట్లాడితే మాకు డబ్బు లేదు డబ్బు లేదు అని బీద పలుకులు పలకడం తప్ప..డబ్బేం లేకపోతే ఇలా మెయిన్‌టైన్ చేయగలరా..పైగా మీరు  జనంలోకి వచ్చే ప్రతి సమయం,సందర్భం ప్రతిపక్షనేత ఏదోక ఇష్యూపై పోరాటం చేస్తున్నప్పుడు కావడం అందరూ గమనిస్తూనే ఉన్నారు..నిత్యం జనంలో ఉండే జగన్‌తో మిమ్మల్ని మీరు ఎలా పోల్చుకుంటారు..మీ అభిమానులు ఎలా పోల్చుకుంటారు..సినిమాల్లో హీరోగా మీకు ప్రపంచంలోనే ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు అంతమాత్రాన రాజకీయంగా కూడా అది అదే స్థాయిలో ఉంటుందనుకోవడం భ్రమ. 
తమిళనాడులో రజనీకాంత్ వస్తా వస్తా అంటున్నాడే తప్ప రావడం లేదు..ఇక్కడ నువ్ వచ్చా వచ్చా అంటున్నావ్ తప్ప వచ్చి పోటీనే చేయవు..కనీసం వార్డు ఎన్నికల్లోనైనా పోటీ చేయి గురూ..కాస్త కార్యకర్తలు( ?) మా పార్టీఅని చెప్పుకోవడానికి ఉంటుంది..ఇదేదో ఎగతాళిగా కాదు..నిజంగానే చెప్తున్నాం..విడిగా నువ్వూ పోటీ  చేస్తే ఏం ఒరుగుతుందో చూడాలని ఉంది

Comments