కర్నూలు ఎమ్మెల్సీ వదిలేయడం కరెక్టేనా జగన్..ఇది తగదు


అసెంబ్లీ సెషన్స్ వదిలేశారు..సరే దానికొ లెక్క ఉంది..కానీ చేతిలొ ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామ ా చేసి జగన్ పార్టీలొకి జంపైన తర్వాత చక్రపాణి రెడ్డి  ఒటమి తర్వాత ఇప్పుడు నొటిఫికేషన్ విడుదలవగా..పొటీనే పెట్టకపొవడంపై విమర్శలు వస్తున్నాయ్. ఎందుకంటే పార్టీలుగా ఎన్నిసార్లు ఎన్నికలు వస్తే అన్నిసార్లు పొటీ చేయాల్సిందే. అప్పనంగా అవతలి పార్టీకి వదిలేశారంటే పలాయనవాదం అనే ప్రమాదం ఉంది. అందుకే  ఈ విషయంలొ జగన్ పార్టీ ఇంకొసారి ఆలొచించుకొవాలని పార్టీ అభిమానులు కొరుతున్నారు. 

ఇప్పటికే ఎటూ పరాజయం పాలైతారనే ఇలా చేస్తున్నారనే ఎగతాళి, చవుకబారు కామెంట్లు మొదలయ్యాయ్ కూడా. అందుకే కనీసం ఎవరైనా ఇఁడిపెండెంట్‌కి మద్దతు అన్నా ఇస్తే అదొరకపు వ్యూహంగా చెప్పుకొవచ్చు.  లేదంటే, ప్రచార ఆర్భాటమే తప్ప ఎక్కడా బరిలొ నిలవలేని జనసేనకి నకలుగా మారుతుంది. అదీ లేదంటే కాంగ్రెస్ అభ్యర్ధికి లొకల్ కేడర్‌ని మద్దతు పలకాల్సిందిగా అయినా చెప్పొచ్చు
ప్రజాస్వామ్యం ఖూనీ కావడం ఇష్టం లేక, అవినీతికి లాకులు ఎత్తలేక వంటి పదాలు పేపర్లలొ బావుంటాయేమొ తప్ప..ఎన్నికలలొ నిలబడవు. లేదంటే గుజరాత్‌లొ ప్రధానమంత్రి మొడీ ఎలాంటి చవుకబారు ప్రచారం చేశారొ చూశారు కదా..అఁదుకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ బిట్వీన్ లవ్ అండ్ వార్ ని ఎలక్షన్స్ ‌కి కూడా వర్తింపజేసి..గెలుపు మంత్రమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏ కొద్దిమందికొ తప్ప అందరికీ రుచించదు. ఐతే ఇక్కడ ఆర్దిక స్థితిగతులు కూడా లెక్కలొకి తీసుకుంటే ఆ పార్టీపై కాస్త సానుభూతి తప్పదు మరి. ఎందుకంటే నంద్యాల బైపొల్ సందర్భంగా ఎంత ఖర్చైందొ తెలిసి కూడా మళ్లీ అంత ఖర్చు పెట్టమనడం కూడా సబబు కాదు మరి.( బైపొల్‌ల పరాజయం తర్వాత ఈ ఇద్దరు బ్రదర్స్ మళ్లీ టిడిపివైపు చూస్తున్నారనే టాక్ కూడా ఉంది ఐతే అదెంత వరకూ నిజమొ తెలీదు. ఐనా అధికారపక్షం నుంచి ప్రతిపక్షానికి వచ్చి తన ఎమ్మెల్సీ కూడా వదిలేసుకున్న తర్వాత తిరిగి అదే పార్టీలొకి జాయినవడం పలచన కావడమే. అందుకే సైలెంట్ అయ్యారనే టాక్ కూడా ఉంది)

Comments