జనాల సహనానికి పరీక్ష రజనీకాంత్


రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం అనేది ఓ చప్పటి సబ్జెక్ట్ గా మారిపోయింది..కాదు స్వయంగా రజనీకాంతే మార్చేశాడు. దేవుడు ఆదేశిస్తాడు..నేను పాటిస్తాను అనుకుంటూ అరిగిపోయిన రికార్డు వేసుకుంటోన్న రజనీకాంత్ అసలు ఆ అవసరం ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు

కనీసం 20 ఏళ్ల నుంచి ఇదే తంతు..అసలు దేవుడు ఆదేశించే సమయానికి మనం ఉంటామా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. తమిళనాడులో ఇప్పుడు జయలలిత లేకపోతేనేం ఆ పాత్ర పోషించడానికి కమల్ హసన్, అజిత్, విజయ్, విశాల్ రెడీగా ఉన్నారు..పదేళ్లనుంచి పోరాడుతోన్న విజయ్ కాంత్ ఎటూ ఉన్నాడు . కాకపోతే తన చిత్తభ్రాంతితో తానే తన రాజకీయజీవితానికి సమాధిని కట్టుకున్నాడు విజయ్ కాంత్..ఐతే ఇప్పటికీ కాస్తో కూస్తో ఈయన డిఎండికే పార్టీకి ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి సమయంలో -నేను వస్తా..కానీ టైమ్ ఉంది..దిగితే గెలిచే తీరాలి..రేపేమవుతానో నాకే తెలీదు లాంటి డైలాగులేసుకుంటా కాలం వెళ్లదీయడం మనకే చిరాకు పుట్టిస్తుంటే ఇక అరవతంబిలకు ఎలా ఉంటుందో

అప్పటికీ కస్తూరిలాంటి నటి కూడా వస్తా వస్తా అంటే కుదరదు, వస్తావో రావో చెప్పు అంటూ నిలదీసింది కూడా..చూడబోతే ఏపీలో చిరంజీవి, పవన్ కల్యాణ్ పరిస్థితిని చూసి రజనీకాంత్ బాగా భయపడుతున్నట్లు ఉన్నాడని కొంతమంది కామెంట్. కానీ రజనీకాంత్ తన పరువు పోతోంది అని చెప్పుకోవడానికి ఆయన ముందు ఎంతో జీవితం ఏం లేదు ఇప్పుడు 70 ఏళ్లకి దగ్గరపడ్డాడు. మహా చేస్తే ఇంకో మూడేళ్లకి మించి సినిమాలు చేయలేడు. ఆ తర్వాత ఇక చేయడానికి రాజకీయాలు తప్ప ఏమీ లేదు. అఁదుకే ఆ రాజకీయాల్లోకి  వచ్చేది ఏదో తొందరగా అనౌన్స్ చేయమని ఫ్యాన్స్ చికాకు పడుతున్నారు. 

Comments