బాలయ్యపై మహీంద్రా కంపెనీ అధినేత వేసిన జోక్ అదిరిందిగా


దక్షిణాది సినిమాలంటే నార్త్ ఇండియన్స్‌కి భలే చులకన. దానికి తగ్గట్లుగానే మన సినిమాల్లో పైట్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయ్.అంతమాత్రాన వాళ్ల సినిమాల్లో ఆభూత కల్పనలు ఉండవా అంటే బ్రహ్మాండంగా ఉంటాయ్. ఐనా వారికున్న నోటి బలంతో మన సినిమాలపై జోకులు వేసుకుంటూ తిరుగుతుంటారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు అంటే సౌండ్ ఆపేసి చూస్తే కోతులు ఎగురుతున్నట్లు ఉండేవని కొంతమంది ..జయసుధని ఏడిపించేవారట

అదంతా గతం ఇప్పుడు ఓరకంగా ప్రపంచమే ఎదురు చూసేవిధంగా మన సినిమాలు తయారవుతున్నాయ్.
ఐనా సరే కొందరు హీరోల యాక్షన్ సీన్స్ పై బోలెడన్ని జోకులు పేలుతుంటాయ్. అందులో తమిళనాడులో విజయ్‌కాంత్. తెలుగులో బాలకృష్ణ పైట్ సీన్స్‌పై లెక్కలేనన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయ్.

తాజాగా జై సింహాలో మహీంద్రా బొలెరో కారుని బాలయ్యబాబు ఒక చేత్తోనే పైకి లేపే సన్నివేశం ఒకటుంది..దాన్ని సరదాగా ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు..అదలా తిరుగుతూ తిరుగుతూ ఆనంద్ మహీంద్రా( బొలెరో కంపెనీ అధినేత)కి చేరింది..దాన్ని చూసిన ఆయన అంతకన్నా సరదాగా "ఇక మా బొలెరో సర్వీస్ సెంటర్లలో హైడ్రాలిక్ లిఫ్టులతో సర్వీసింగ్ చేయాల్సిన అవసరం లేదు " అంటూ ట్వీట్ చేశారు..ఇంకేముంది ఇలాంటి ట్వీట్లను రీట్వీట్  చేయడంలో ఫ్యాన్స్. యాంటీ ఫ్యాన్స్ ముందుంటారు కదా..అదే పని చేశారు..


మన బాలయ్యే కాదు తెలుగు హీరోల్లో ఇలాంటి అతిశయోక్తి సన్నివేశాలు చాలామందే చేశారులెండి


Comments

  1. such a great post and very creative software this software information is very useful!!! It is really a good work and your post is the knowledgeable. If you want more websites link is given below!
    Airparrot 3.1.8 Break/a>
    Blender Master 3.4.2

    ReplyDelete

Post a Comment