అసలు స్పీకర్‌కి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఉందా?


తెలంగాణ అసెంబ్లీ నుంచి 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో పాటు, ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్, సంపత్ పదవిని రద్దు చేయడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. అనర్హత వేటు వేయడం వేరు. ఇలా సభలో ఎమ్మెల్యేల ప్రవర్తన దృష్ట్యా సభ్యత్వాన్నే రద్దు చేయడం వేరు అందుకే ఇక్కడ ఈ అంశం చర్చకు వస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం ఖాయం..ఈ క్రమంలోనే ఒక స్పీకర్ కి ఎమ్మెల్యేన సభ్యత్వాన్ని రద్దు చేసే పవర్స్ ఉంటాయా..అసలు ఓ స్పీకర్ అధికారాలు ఏంటి..బాధ్యతలు ఏంటి అనే అంశం ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిందే 

దీనికి దాదాపు రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలుసుకోవాలి. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ కి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడం కుదరదు. దీనికి మరో మెలిక ఉంది. అసలు స్పీకరే అభిశంసన ఎదుర్కొంటున్నవారైతే..మిగిలిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. ఇదీ అప్పటి తీర్పు..కాబట్టి..ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల పదవులను రద్దు  చేయడంపై మధుసూదనాచారికి ఆ అర్హత ఉందా లేదా అనేది మరో ప్రశ్న..ఇక మరోవాదన, సభలో జరిగే కార్యకలాపాలపై స్పీకర్‌ వెంటనే చర్యలు తీసుకోవడం కుదరదు. ముందుగా సభ్యులను సస్పెండ్ కానీ, డిస్మిస్ కానీ చేయమని తీర్మానం చేయాలి.. ఆ తర్వాత సభ్యుడికి తన వాదన తెలుపుకునే అవకాశం ఇవ్వాలి.
 ఆ తర్వాతే మిమ్మల్ని ఎందుకు అనర్హులుగా చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయాలి..ఇది అంతా కనీసం మూడు నెలలపాటు జరిగే ప్రక్రియ ఇలాంటి విచక్షణ ఆధారంగా జరిగే ప్రక్రియ కాబట్టే పార్టీలు మారిన జంప్ జిలానీలపై కూడా వేటు వేయకుండా స్పీకర్లు తప్పించుకుంటున్నారు. అలాంటి సమయంలో  ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయడం నిలబడే చర్య కాదని అంటున్నారు. కేవలం తమని కక్ష సాధించేందుకే ఇలా చేసారని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఐతే సభలో వీళ్ల తీరు చూసినవాళ్లు మాత్రం ఆ ప్రవర్తనని సమర్ధించరు. వీధి రౌడీల్లా చేతికి ఏది దొరికితే అది గవర్నర్ స్పీకర్ ఛైర్లవైపు విసిరేయడం అల్లరిమూకలనే తలపిస్తుంది తప్ప వేరొకటి కాదు. అందుకే తెలంగాణ స్పీకర్ చర్యకి మద్దతు కూడా కన్పిస్తుంది

Comments