జనంపై చింతమనేని జులుం చూడండి..


ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఆయన వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే..!  తన అనుచరులపైనే విరుచుకుపడినా ఎస్సైపై, మంత్రులపై దాడి చేసినా..ప్రభుత్వ అధికారులపై తెగబడినా..ఈ దెందలూరు ఎమ్మెల్యేకే సాధ్యం..అలాంటి చింతమనేని..ఈసారి తన జులుం ఆర్టీసీపై చూపించారు..దీనికి కారణం..తనకి కన్పించిన ఆర్టీసి బస్సుపై చంద్రబాబునాయుడి బొమ్మ కన్పించలేదు కాబట్టి అట.
అసలు ఆర్టీసీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేదే తప్ప..పూర్తిగా ప్రభుత్వానిది కాదు..ఆర్టీసికి ఇవ్వాల్సిన నిధులు సమకూర్చకుండా ప్రతి సభకీ జనాలని తరలించుకునేదీ ఈ బస్సుల్లోనే లక్షకి పైగా సర్వీసులతో జనాన్ని గమ్యస్థానాలకు చేర్చే..ఆర్టీసిపై ఈ జులుం ఎవరూ సహించలేనిది..అధికారంలో ఉన్నంత మాత్రాన
ప్రతి వాడూ నా పోస్టర్..నా బొమ్మ ఉఁడాలంటే కుదరదు..ఈ విషయంపై కోర్టుకెళ్లినా ప్రభుత్వానికే మొట్టికాయలు పడతాయ్.
తాజా విషయానికి వస్తే..ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్‌కి వస్తోన్న బస్సులో చంద్రబాబు బొమ్మ చిరిగి ఉందట..వెంటనే ఈ హీరో బస్సు డ్రైవర్ కండక్టర్ పై బూతులు లంకించుకున్నాడు. డిపోకి వెళ్లిన తర్వాత సరిచేయిస్తామని చెప్పినా వినకుండా విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఊగిపోయాడట
ఇదంతా చూస్తోన్న గరికపాటి నాగేశ్వర్రావ్ అనే వ్యక్తి ఎందుకు సార్ స్టాఫ్‌ని వేధిస్తారన్న పాపానికి అతనిపై చేయి చేసుకున్నాడు ఈ విప్ దీనికి తోడు సదరు ఆర్టీసీ బస్సులోని జనాలని దింపి బలవంతంగా వేరే బస్సులోకి ఎక్కించి పంపారు..విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వచ్చి సర్ది చెప్పినా వినలేదట.

మరి దాడికి గురైన నాగేశ్వర్రావ్ ఈ విషయంపై మనస్తాపం చెంది అక్కడిక్కడే కూర్చుండిపోయి కాసేపు ధర్నా చేశాడు. పోలీసులు నాగేశ్వర్రావ్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని ఎమ్మెల్యే కమ్ ప్రభుత్వ విప్ అయిన చింతమనేనిపై కేసు రిజిస్టర్ చేశారు..ఇదండీ ఓ ప్రభుత్వ విప్ ప్రవర్తించే తీరు..

Comments