ఏది నిజం..మరీ ఇంత నిర్లక్ష్యమా..! ఇంతకీ ఈ ఇద్దరు ఎందులొ నేరస్థులు


వద్దు వద్దనుకుంటూనే కొన్ని విషయాలపై స్పందిస్తాం..పేపర్లలొ వచ్చే న్యూస్ కూడా అందులొ కొన్ని..మేం తప్పు రాస్తే డైరక్ట్‌గా ఇక్కడ బూతులు తిడతారు..అదేదొ హక్కన్నట్లుగానే భావించేవాళ్లు ఉంటారు..అక్షరం ముక్క రాయడం  చేతకాకపొయినా వీక్షకులు కాబట్టి వారికా హక్కు ఉండొచ్చు..కానీ దినపత్రికలకు ఇంకెంత జవాబుదారీ తనం ఉండాలి..పెద్ద పెద్ద నేతల విషయంలొ రియాక్షన్ ఎటూ ఘాటుగానే ఉంటుంది..కానీ ఇలాంటి చిన్న వాళ్ల సంగతి చూడండి..మొదటి క్లిప్పింగ్‌లొ వీరిద్దరి పేర్లు ప్రశాంత్ , సుభాష్ చంద్ర..అయితే..జిఎస్టీ ఆఫీసర్లుగా చెప్పుకుని నేరాలు చేశారట..

మరి  ఇదే దినపత్రిక వెంటనే ఆ రెండొ పేజీలొనే..వాహన దొంగల అరెస్ట్ అని ఇంకొ ఇద్దరి పేర్లని ఈ ఫొటొలకే అంటగట్టింది..అంటే వీరిద్దరే ఈ రెండూ చేశారా..లేక ఏదొ ఒక నేరానికి మాత్రమే పరిమితమా..లేక అసలు ఈ రెండు ఫొటొలు  ఈరెండు నేరాలకు సంబంధం లేదా...?
మరి మీడియాని ప్రశ్నిస్తే..ఏదొక నెపం మీద మన మీద కూడా వార్తలు రాసేస్తారని ప్రచారం ఉంది..అది నిజం కాకపొతే..దీనిపై రేపటి సంచికలొ ఖచ్చితంగా వివరణ వస్తుందని ఆశిద్దాం




నిజానికి ఈ పత్రిక చిన్నదైనా కూడా చాలామంచి వార్తలను..చాలా వేగంగా అందించడంలొ( ఇంటర్నెట్ ఎడిషన్ వరకూ) ముందు ఉఁటుంది. అంతర్జాతీయ, జాతీయ వార్తలను సవివరంగా అఁదజేయగల సత్తా ఉన్న స్టాఫ్ అని పత్రిక చూస్తే  అర్ధమవుతుంది..మరి హైదరాబాద్ టాబ్లాయిడ్ విషయంలొ ఎందుకు ఇలా జరిగిందొ...నా విన్నపం ఏంటంటే..తప్పు సరి చేసుకొమని..అంతేకానీ బాధ్యులెవరొ తెలుసుకుని శిక్షించమని కాదు..


Comments