భలే..భలే..నందుల్లా ఇవి కూడా పంచారా ఏంటి..బాహుబలి నిర్మాతకే తెలియకుండా అవార్డా..?


మన తెలుగు నందుల వివాదం మరిచిపొక ముందే జాతీయస్థాయిలొనూ అవార్డుల విషయంలొ చిన్నపాటి రగడ ఏర్పడింది. తెలుగు బాహుబలి సినిమాకి మూడు జాతీయ పురస్కారాలు అందుకుంటే అందులొ ఒకటి అబ్బాస్ అలీ మొఘల్ అనే వ్యక్తికి యాక్షన్ డైరక్షన్‌కి ఇచ్చినట్లు ప్రకటించారు..ఇది అనవున్స్ చేయగానే కాస్త సినిమా సెన్స్ ఉన్న వాళ్లెవరైనా..ఎవరబ్బా ఈ ఘనుడు అనుకొకుండా లేరు..ఏదొ జాతీయ అవార్డు కదా..ఏదొ చేసి ఉఁటాడ్లే అని తెలుగు జనం సరిపెట్టుకొలేరు ఎందుకంటే..ఇతగాడు బాహుబలికి యాక్షన్ డైరక్షన్ చేసినట్లు..దానికే అవార్డు ఇచ్చినట్లు ప్రకటించారు..దీంతొ మనకే కాదు..బాహుబలి నిర్మాతకి కూడా పాపం అనుమానం వచ్చేసింది.అందుకే అతగాడెవరూ మాతొ పనిచేయలేదు..మరి ఏ కేటగరి కింద ఆయనకు అవార్డు ఇచ్చారొ మాకు తెలీదు అని ట్వీట్ చేశాడు..దీంతొ జాతీయఅవార్డులు ప్రదాన కమిటీ కూడా అభాసు పాలైనట్లు భావించాలి..ఇలానే గత ఏడాది ఆస్కార్ అవార్డులు కూడా ఒకరికి ప్రకటించబొయి మరొకరికి ప్రకటించారు..ఇంతకీ ఈ అబ్బాస్ అలీ ఎవరయ్యా అంటే హిందీ సినిమాల్లొ ఈ మధ్యే మొదలైన ట్రెండ్ ఒకటి..యాక్షన్ డైరక్షన్ అనే విభాగం..అంటే ఫైట్లూ..ఛేజింగులూ ..థ్రిల్లింగ్ దృశ్యాలు చిత్రీకరించడానికి మరొకరు ఉంటారన్నమాట..వీళ్లు డైరక్టర్లు కాదు..కేవలం ఆ సీన్లు మాత్రమే డిజైన్ చేస్తారన్నమాట..

అలా ఈ అబ్బాస్ అలీ మొఘల్ దాదాపు 50 సినిమాలకి పైనే ఉన్నాయ్. 2000 సంవత్సరంలొ ఎంట్రీ ఇచ్చిన ఇతగాడు హసీనా కొ మేలా సినిమాతొ డైరక్టర్‌గానే కెరీర్ ఆరంభించాడు..ఐతే ఆ తర్వాతే కాలం కలిసిరాక ఇలా యాక్షన్ సీక్వెన్లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. అగ్నిపథ్, హేట్ స్టొరీ, రాజ్ త్రీ, తలాష్, స్పెషల్ చబ్బీస్
సత్యాగ్రహ్, అవర్ ఆఫ్ ది డెడ్, ఎలొన్ , ధొని, మెసెంజర్ ఆఫ్ గాడ్ అబ్బాస్ అలీ మొఘల్‌కి పేరుతొ పాటు డబ్బూ తెచ్చిపెట్టాయ్. ఇక పొరపాటున వేరే సినిమాకి అవార్డు ప్రకటించారనుకుంటే..2017లొ ఇతను పని చేసిన సినిమాలు
తాాప్సీ నటించిన నామ్ షబ్నా..అక్షయ్ కుమార్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, 1921 ఉన్నాయి..వీటిలొ టాయిలెట్ సినిమానే మంచి రిజల్ట్ ఇచ్చింది బహుశా ఆ సినిమాకే ప్రకటించబొయి..బాహుబలికి ప్రకటించి ఉంటారని  అంచనా..ఏదెలా ఉన్నా..ఈ ఎపిసొడ్‌తొ జాతీయ అవార్డులు కూడా పక్షపాతానికి దూరంగా లేవని అర్ధమైందంటారు.

Comments