నయీమ్..ఇతను ఇంకొకడు.. చేసే పని చూడండి..సాయం చేయాలనిపిస్తుంది


నయీమ్...ఈ పేరు వినగానే..కాస్త పేపర్లు చదివేవాళ్లకి ఒక కరడుగట్టిన క్రిమినల్ గుర్తుకు వస్తాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే నయీం వేరు..షేక్ నయీం..కేరాఫ్ రసూల్ పురా..క్రియా సంఘ సొసైటీ అనేదాన్ని నడుపుతుంటాడు..ఏదొ ఆధ్యాత్మిక కార్యక్రమాలొ..లేక వేసవిలొ చలివేంద్రాలొ పెట్టడం లేదు..ఆకలి అంటూ వచ్చినవాళ్లకి పట్టెడన్నం పెడుతున్నాడు. జీహెచ్‌ఎంసి 5 రూపాయల భొజనంలా కాదు..ఇంకా కొద్దిగా మంచిగానే..
నవంబర్ 14,2017న ప్రారంభం అయింది ఈ కార్యక్రమం..ఇన్‌స్పిరేషన్ అంటారా..ఏం లేదు..మనలానే రొజూ తిండికి అల్లాడేవాళ్లని చూసి అయ్యొ పాపం అన్పించింది..రొజంతా కష్టపడితే వచ్చే 50,100 రూపాయల్లొ తిరిగి తిండికే 40,50 రూపాయలు ఖర్చు అవుతుంటే..తినలేక..వాటిలొనే కాస్త దాచిపెట్టుకుంటున్నవారు..అసలు పనే దొరకక పస్తులుండేవారే ఇతని లక్ష్యం.. ఇళ్లలొ నిరాదరణకు గురయ్యే వృధ్దులని కూడా పట్టించుకొవాలని..అందరూ ఉన్నా అనాధలవడం పెద్ద నేరమని చెప్తాడితను..అందుకే అలాంటి వారికొసం రసూల్ పురాలొ రొజూ భొజనం ఏర్పాటు చేస్తున్నాడు..ఇందుకొసం నయీమ్‌తొ కలసి  కనీసం నలుగురైదుగురు పని చేస్తుంటారట.

ప్రతి రొజూ ఇందుకొసం రూ.2వేలు ఖర్చు  అవుతున్నట్లు లెక్క తేలింది. అలానే 30కేజీల బియ్యం అవసరం పడుతుందట. 60-70 మంది కడుపు నింపుకుంటున్నారట. వారాంతంలొ నయీమ్‌తొ కలిసి పని చేసేందుకు విద్యార్ధులు, ఉద్యొగులు కొంతమంది ముందుకు వస్తున్నారట. ఇందులొ ఏ పొలిటికల్ లీడర్‌ హస్తం లేదని..వారి జొక్యం లేకుండానే ఈ కార్యక్రమం నిర్వహించాలనేది నయీం లక్ష్యంగా చెప్తున్నాడు. ప్రస్తుతానికి ఎంబి ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నెలకి 15 కేజీల బియ్యం వస్తుందట. దానికి మిగిలిన వారు కూాడ సాయం చేస్తుండటంతొ ప్రస్తుతానికి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతొందట. ఎంత ఎక్కువమంది కలిసి వస్తే..అంత ఎక్కువమందికి భొజనం పెట్టే వీలుంటుందని నయీమ్ ఆలొచనగా తెలుస్తొంది.

వీటితొ పాటు..నయీమ్  కృియా సంఘ్ సొసైటీ తరపున  మహిళలకు చేతివృత్తులు సహా ఇతర ఉపాధి కార్యక్రమాలను ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు కొన్ని క్లిప్పింగ్స్ దొరికాయ్..సొ..భవిష్యత్తులొ నయీమ్..ఏదొక రంగంలొ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడనిపించడంలొ సందేహం లేదు

Comments