బాబాయ్ బాలకృష్ణకి అబ్బాయ్ ఎన్టీఆర్ ఇన్‌డైరక్ట్ సెటైర్




నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ వారసుడిగా నిలబడింది ఎవరంటే అది బాలయ్యే అని చెప్తారు. అంతమంది సంతానంలో నందమూరి బాలకృష్ణ ఒక్కరే సినీరంగంలో అయినా రాణించారు. అటు రాజకీయాల్లోని ప్రవేశించి ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు..ఐతే నందమూరి తారకరామారావు పేరుతో వచ్చిన ఓ యువతరంగం జూనియర్ ఎన్టీఆర్ ఉరఫ్ తారక్..ఈయన ఫాన్ ఫాలోయింగ్‌లొ కొంత బేస్ తీసుకువెళ్లాడంటారు. ఎన్టీఆర్ రంగప్రవేశం చేసిన కొన్నేళ్లకే స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలతో స్టార్ డమ్ సంపాదించారు.

ఇంత సక్సెస్ అయినా బాబాయ్ బాలయ్య ఇతనితో అంటీ అంటనట్లు వ్యవహరిస్తుంటాడని గాసిప్స్ ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్నాయ్. దానికి తగ్గట్లే వీళ్ల వ్యవహారశైలి కూడా ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌ ఓపెనింగ్‌కి కూడా జూనియర్ కానీ..హరికృష్ణ కానీ కన్పించకపోవడం వాటినే ధృవపరుస్తుంది..ఐపిఎల్‌కి ప్రచారకర్తగా ఎన్నికైన సమయంలో తారక్‌ని ఈ బయోపిక్‌లో  ఏదైనా ఛాన్స్ వచ్చిందా అంటే తారక్ రాలేదు..వచ్చినా చేయను కూడా అని తెగేసి చెప్పాడు. అలానే బాలయ్య కూడా ఎన్టీఆర్ సినిమాలో పెద్దగా సక్సెస్ కాని నందమూరి హీరోలనే ట్రై చేస్తున్నాడంటున్నారు కానీ..జూనియర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు

 దీనికి ప్రతిగానా అన్నట్లు..ఎన్టీఆర్..మహానటి ఆడియో ఫంక్షన్లో తన అభిప్రాయం వెల్లిబుచ్చాడు. మహానటిలో ఎన్టీఆర్ పాత్ర కోసం నిర్మాత స్వప్న సంప్రదించినట్లు చెప్పాడు. ఐతే తనకి ఎన్టీఆర్ పాత్ర ధరించే దమ్ము లేదని అన్నాడు..అంతే కాదు ఈ జన్మలో అలాంటి సాహసం చేయనని కూడా చెప్పాడు. ఈ మాటలు బాలకృష్ణకి ఇన్ డైరక్ట్ సెటైర్ అని..ఎన్టీఆర్ పాత్రలో నటించే అర్హత తనకి లేదని చెప్పడం ద్వారా..ఇంకెవరికీ కూడా లేదనే అర్ధం
వచ్చేలా చేయడమే తారక్ అసలు ఉద్దేశం అంటున్నారు..అందుకే ఫేస్ బుక్‌లో ఎన్టీఆర్‌పై కొంతమంది ఫ్యాన్స్ మండిపడుతున్నారు కూడా.

Comments