మూడో బాహుబలి.0 వచ్చేస్తోంది..

బాహుబలి, బాహుబలి.2 సిినిమాలు చూసిన కొంతమందికి ఈ సినిమా అప్పుడే ముగియడం నచ్చలేదు. ఏదో మిస్సైన ఫీలింగ్. ఇంకాస్త కథ ఉంటే బావుండు ఈ క్యారెక్టర్లు ఇంకొద్ది సేపు కన్పిస్తే బావుండు అనుకోవడం సహజం..వారికి ఫుల్లుగా తృప్తిగా చూసుకునేందుకు మరో బాహుబలి రాబోతోంది. ఐతే ఈసారి ఈ బాహుబలికి
దర్శకత్వం రాజమౌళి కాదు. ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా..

ఐతే ఇది సినిమా కాదు..వెబ్ సిరీస్..అయినంత మాత్రాన ఎవరూ నిరాశ పడక్కర్లేదు. 375 కోట్ల పెట్టుబడితో ఈ సినిమా సిరీస్ తీయబోతున్నారు. బాహుబలికి ముందు శివగామి ఏం చేసింది..ఆమె రాణి ఎలా అయింది వంటి విషయాలతో ది రైజ్ ఆఫ్ శివగామి ఉంటుంది..ఇది ఆనంద్ నీలకంఠ్ అనే రచయిత బాహుబలి సినిమాల స్ఫూర్తితో రాసుకున్న నవల. ఇది నచ్చడంతో రాజమౌళి వెబ్ ‌సిరీస్ తీసేందుకు సిధ్దపడ్డారని అంటున్నారు. ఇప్పటికే బాహుబలి సెట్‌లపై స్వర్ణఖడ్గం అనే సీరియల్ తయారవుతోన్న సంగతి తెలిసిందే కదా..

వాటికి తోడు బాహుబలిపై జనానికి ఉన్న మోజుని క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే రాణా మెయిన్ రోల్‌తో ఓ కార్టూన్ సీరియల్ వస్తోంది డైలీలలో..అలానే ఈ వెబ్‌సిరీస్ కూడా అందరినీ అలరిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు
 మరిన్ని వివరాలు...మరి కాసేపట్లో

Comments