సూపర్ స్టార్..మహేష్ అను నేను ఛాలెంజ్ స్వీకరిస్తూ 3 మొక్కలు నాటాను మరి మీరు


మహేష్ బాబు ఏం చేసినా అందంగానే ఉఁటుంది. సినిమాల్లో హిట్టూ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే ఆయన కన్పిస్తే చాలనుకునే ఫ్యాన్స్‌కి తక్కువ లేరు. ఇదే అభిమానం ఆయన తండ్రిపైన గతంలో చూపించేవారు ఫ్యాన్స్..ఇప్పుడు అదే వారసత్వంగా ఈయనకీ వచ్చింది. ఇప్పుడు సూపర్ హిట్ సినిమా భరత్ అను నేను వచ్చిన తర్వాత తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యాడు.
తోటి హీరోలతో..అటు ఫ్యాన్స్‌తో సహజసిధ్దమైన, స్వఛ్చమైన మనసుతో వ్యవహరించే మహేష్ అంటే సెలబ్రెటీలు కూడా ఇష్టపడతారు. దాదాపుగా ఇండస్ట్రీలో ఆయనతో ఓసారైనా సినిమా చేయాలనే కోరిక వెల్లిబుచ్చని నటి, సినిమా చేయాలని ఆశించని దర్శకులు లేరు.అలాంటి మహేష్‌తో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలనేది ఎవరికి వచ్చిన ఆలోచనో కానీ..అది చక్కగా పేలుతుంది.

అందుకే ఇప్పుడు అటు ఖాదీ చేనేత వస్త్రాలను ధరించడం తర్వాత హరితహారంలో ఆయనకి మెసేజ్ ఫార్వార్డ్ చేయడం ద్వారా ప్రభుత్వం అనుకున్న పని సాధించింది. ముందు సూపర్ స్టార్ అంతటివాడు వీటిని యాక్సెప్ట్ చేస్తాడా అనే మీమాంస కూడా ఉంటుంది..ఐనా సరే సిటీలో చిన్న అధికారి మెసేజ్ పెట్టినా పెద్దవాళ్లు కోరినా వెంటనే స్పందించి రంగంలోకి దిగిన తను ముద్దుల తనయతో కలిసి మొక్కలు నాటడం అభినందనీయం..వాటిని నాటడం కాదు..చెట్లయ్యేవరకూ పెంచగలిగితే ఇంకా సంతోషం.



Comments