చిరకాల యశస్వి ఈ రంగారావ్


ఎస్వీ రంగారావ్ ఈ పేరు విన్నా..తలచుకున్నా తెలుగువారికి ఒక తలెత్తుకున్న పెద్దరికం తలపుకు వస్తుంది.
గంభీరమైన కంఠం మదిలొ జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. తెరపై నిండైన విగ్రహంతొ ఒక్కసారి చూస్తే ఎప్పటికీ గుర్తుండిపొయే వదనంతొ తనకి మాత్రమే సాధ్యమైన అభినయం ఆయన సొంతం. కృష్ణాజిల్లా నూజివీడులొ 1918 జులై3న సామాన్య కుటుంబంలొ జన్మించాడు ఎస్వీఆర్..ఆయనపూర్తి పేరు సామర్ల వెంకట రంగారావ్,  ఆ పేరు తల్లిగారైన సామర్ల లక్ష్మీ నరసాయమ్మ వెంకటేశ్వరస్వామిపై భక్తికి గుర్తుగా పెట్టారట. తండ్రి సామర్ల కొటేశ్వరరావ్ ఎక్సైజ్ సిఐగా పని చేసేవారట. మొదటి ప్రపంచ యుధ్దం ముగిసేదశలొ ఉన్న ఆ సమయంలొ స్కూలింగ్ కొసమని ఎస్వీఆర్ మద్రాస్ ప్రెసిడెన్సీలొని హిందూ స్కూల్‌లొ జాయిన్ అయ్యారట. తనకి 12వ  సంవత్సరం వచ్చీ రాగానే నాటకాలపై మనసు పారేసుకున్నాడట ఎస్వీఆర్. ఐతే తెరపై మెరవడం మాత్రం డిగ్రీ పూర్తైన తర్వాతే జరిగింది.

తన తండ్రికి తెలిసినవారు, తన బంధువు అయిన బివి రామానంద్ వరూధిని అనే సిినిమాలొ ఎస్వీఆర్ కి మొదటి అవకాశం కల్పించారు. అదీ సూపర్  హిట్ సినిమా..దీంతొ ఇఁడస్ట్రీలొ తమకి కొన్ని పేజీలు రాసి పెట్టి ఉన్నాయ్ అని ఎస్వీఆర్‌కి  అర్ధమైందట. కానీ, ఆ తర్వాత హఠాత్తుగా సినిమాకి కాసేపు విరామం ఇచ్చి..జంషెడ్జ్ పూర్‌లొ టాటా కంపెనీలొ ఉద్యొగం మొదలుపెట్టారు. ఐతే అక్కడ కూడా నాటకాలపై మక్కువతొ వివిధ ప్రదర్శనలు ఇస్తూ తర్వాతి దశకు పునాది వేసుకున్నారాయన. అక్కడే లీలావతి గారితొ వివాహం కూడా జరిగింది. వివాహం తర్వాత తిరిగి ఆయనకు సినిమాపై ధ్యాస మళ్లడంతొ 1949లొ మనదేశం సినిమాలొ ముఖ్యమైన పాత్ర పొషించారు. అందులొనే  ఎన్టీఆర్ , సంగీత దర్శకుడిగా ఘంటసాల కూడా పరిచయమైన సంగతి తెలిసే  ఉంటుంది. అలా మొదలైన ఆయన ఎస్వీ రంగారావ్ ప్రభంజనం అప్రతిహతంగా సాగింది. మనదేశం తర్వాత పల్లెటూరి పిల్ల, షావుకారు లాంటి సినిమాల్లొ చిన్నపాటి క్యారెక్టర్లే చేసినా ఎవరీ ఆజానుబాహుడు అని జనం కళ్లెగరేశారు.

అలా కెరీర్ స్లొగా పికప్ అవుతున్న దశలొవచ్చింది ఒక జానపదచిత్రరాజం..అదే పాతాళభైరవి..ఇందులొ ఆయన పలికిన డైలాగ్స్ ఒక చరిత్ర సృష్టించాయ్. సాహసం సేయరా ఢింబకా..సాష్టాంగం సేయరా..అంటూ నేపాళ మాంత్రికుడిగా ఆయన అభినయం ఆ తర్వాతి కాలంలొ ఎన్నొ నాటకాలలొ అనేక మంది అనుకరించారు. ఇప్పటికీ మాంత్రికుడు అంటే ఎస్వీ రంగారావ్ కి చేసిన డిజైన్‌లొనే ఉఁడాలి..అది అమ్రీష్ పురి అయినా..విజయరంగరావ్ అయినా..ఎవరైనా మాంత్రికుడంటే ఎస్వీరంగారావే...పాతాళభైరవితొ ఎన్టీఆర్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడొ అంతకి మించిన స్టార్ డమ్ ఎస్వీఆర్‌కి వచ్చింది. అలా ఎస్వీఆర్ రూపంలొ ఒక సంపూర్ణ నటుడు తెలుగుతెరకి లభించగా..ఆయన చేసిన పాత్రలు, చరిత్రలొ నిలిచిపొయాయ్. అక్బర్,  భీష్మ, దుర్యొధన, యమ, రావణ, తాండ్రపాపారాయుడు, భొజుడు, దక్షుడు, ఘటొత్కచుడు, హరిశ్చంద్ర, హిరణ్యకశిపుడు, కంసుడు, కీచకుడు, మాయాసుర, నరకాసురుడు, రాజరాజనరేంద్రుడు ఇలా ప్రతి పాత్రకీ ప్రాణ ప్రతిష్ట చేశారు. ఎన్టీఆర్ కంటే ముందే అక్బర్, దుర్యొధనుడు, హరిశ్చంద్రుడి క్యారెక్టర్ చేసిన ఘనత ఎస్వీఆర్‌దే. అలానే విశ్వవిఖ్యాత నటచక్రవర్తి బిరుదంతొ పాటు నటశేఖర, నటసింహ అనే బిరుదులతొ కూడా ఆయన్ని అప్పట్లొనే పిలిచేవాళ్లు.. అంటే సూపర్ స్టార్ కృష్ణ కంటే ముందే నటశేఖరుడిగా..ఇప్పటి బాలకృష్ణ కంటే ముందే నటసింహంగా పిలిపించుకున్న చరిత్ర ఉందన్నమాట.
మొత్తం పాతికేళ్ల  చలనచిత్ర జీవితంలొ 162 సినిమాల్లొ నటించారు. వీటిలొ తెలుగు 102 కాగా తమిళంలొ 53 సినిమాలు చేశారు. బహుశా ఏ తెలుగు నటుడూ ఇన్నితమిళ సినిమాలు చేసిన చరిత్ర లేకపొవచ్చు. పైగా ఇప్పటికీ
అక్కడి యూత్ ఇంటర్నెట్‌లొ వెతికి మరీ ఎస్వీ  రంగారావ్ సినిమాలు చూస్తారంటే ఆశ్చర్యమే మరి. తెలుగు తెర ఆ మాటికి వస్తే భారత చలనచిత్రపరిశ్రమలొనే మెథడ్ యాక్టింగ్  చేసిన రికార్డు కూడా ఆయనదే. అంటే పాత్రలొ నటుడు లీనమైపొయి..అక్కడిక నటుడు కన్పించడు..కేవలం పాత్ర ప్రవర్తించే తీరు మాత్రమే కన్పిస్తుంది. ఇంత గొప్ప నటుడు కాబట్టే 1963లొనే నర్తనశాలలొ కీచకుడి క్యారెక్టర్‌కి జకార్తాలొ ప్రశంసలు దక్కాయ్. ఇప్పటిదాకా ఏ తెలుగు నటుడికీ ఇలాంటి అరుదైన ప్రశంస దక్కలేదంటే అతిశయొక్తి కాదు. 5 సార్లు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నది కూడా ఎస్వీ రంగారావే..స్వయంగా నాలుగు సినిమాలు నిర్మించగా..అందులొ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అవి బాంధవ్యాలు, చదరంగం..ఈ  రెండింటినీ ప్రభుత్వ నందులు వెతుక్కుంటూ వచ్చాయ్. ఇక స్టార్‌డమ్ విషయానికి వస్తే ఆయన హీరొ కాకపొయినా, ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకున్నారు. వారికంటే ఎక్కువ లెంగ్త్ ఉండేది ఆయన క్యారెక్టర్ కి..ఒకవేళ లేకపొయినా..ఆయన ఉన్న సీన్లలొ ఆయనే డామినేట్ చేసే స్టేచర్ ఆయనది. ఇక వైవాహిక విషయానికి వస్తే, బడేటి వెంకట్రామయ్యగారి కుమార్తె లీలావతిని 1947లొ పెళ్లాడారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు..ఒక కొడుకు. ఆయన మనవడు జూనియర్ ఎస్వీఆర్ అఁటూ సెవెన్ అనే సినిమాలొ పరిచయం అయినా పెద్దగా ఆ సినిమా ఆడలేదు.




ఎస్వీ రంగారావ్ స్వతహాగా భొజనప్రియుడట. మాంసాహారం ఎక్కువగా ఇష్టపడేవారని చెప్తారు. మద్రాసులొని నుంగంబాకం రొడ్‌లొని గణపతి హొటల్‌లొ చిల్డ్ చికెన్ ఆయన ఫేవరిట్ ఫుడ్ అని ఆయన సమకాలికులు చెప్తారు. తన డైలాగుల విషయానికి వస్తే ఎంత వేగంగా చెప్పినా స్పష్టంగా పదాలు విన్పించగలగడం ఆయన స్టైల్..ఇది ఎవరూ అనుకరించలేకపొయారని ఆయన సమకాలిక నటి షావుకారు జానకి చెప్తారు. షావుకారు జానకి మూడునెలల బాలింతగా కుటుంబ భారం మొయడానికి సినిమాల్లొకి రాగా..ఎస్వీఆర్ కి ఆ విషయం తెలిసి బాగా మద్దతు ఇచ్చారట. ఇక మెగాస్టార్ మాటల్లొ అయితే ఆయనతొ నటించలేకపొయానే అనే బాధ తీర్చలేనిదని చెప్తుంటారు. చిరంజీవి తండ్రి వెంకట్రావ్ ఎస్వీఆర్‌తొ కలిసి జగత్ కిలాడీలు, జగత్‌జెట్టీలు అని రెండు సినిమాల్లొ చిన్న చిన్న పాత్రల్లొ నటించారు.   పండంటి కాపురంలొ తన తమ్ముడికొడుకు చనిపొయిన సీన్‌లొ ఎస్వీఆర్ ప్రదర్శించిన నటన తలుచుకున్నప్పుడల్లా కన్నీరు ఆగదని చిరంజీవి చెప్తుంటారు.   ఇప్పటికీ ఎస్వీఆర్ సినిమాలను రామ్ చరణ్‌కి చిరు చూపిస్తారంటే ఎస్వీ రంగారావ్ గొప్పతనం అర్ధం చేసుకొవచ్చు. జులై 18, 1974లొ ఎస్వీఆర్ గుండెపొటుతొ చనిపొయేనాటికి ఆయన వయసు 56 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులొ చనిపొవడానికి కారణం ఆయనకి మద్యం, సిగరెట్లు అలవాటు ఉండటం వల్లనే కొంతమంది అప్పటి ివిషయాలు తెలిసినవాళ్లు చెప్తారు. ఆయనది భారీ కాయం కావడానికి కారణం కూడా  మద్యపానమే అంటారు. చుట్టూ ఉన్నవాళ్లు ప్రొత్సహిస్తుండటంతొ మితిమీరి తాగుడుకి అలవాటు పడ్డారని చెప్తారు. ఇదే విషయాన్ని హీరొ కృష్ణ కూడా వివిధ ఇంటర్వ్యూలలొ నిర్ధారించారు. పండంటి కాపురంలొ పెద్దన్న క్యారెక్టర్ చేసిన ఎస్వీఆర్‌ని తిరిగి దేవుడు చేసిన మనుషులు చేయమని అడిగారట. ఐతే అప్పుడు రంగారావుగారు నాకు పండంటికాపురానికి 30వేలే ఇచ్చావు..ఈసారి క్యారెక్టర్‌కి 40వేలరూపాయలు ఇవ్వాల్సిందే అన్నారట..మీరు మందు ముట్టుకొనని మాటిస్తే..40వేలు కాదు 50వేల రూపాయలు ఇస్తానని చెప్పారట కృష్ణగారు..అన్నట్లుగా కృష్ణ రూ.50వేలు ఇవ్వడం ఆయన సిినిమా పూర్తయ్యేవరకూ ఒక్క చుక్క కూడా మందు ముట్టుకొలేదట. ఐతే అంత కమిట్‌మెంట్ ఉన్నా కూడా ఒక దశలొ కంట్రొల్ తప్పిపొయి..అల్లూరి సీతారామరాజు సినిమాకొసం నాలుగు రొజులు షూటింగ్‌లొ పాల్గొని కూడా చెప్పా పెట్టకుండా మైసూర్ వెళ్లిపొయారట. అక్కడే యశొదకృష్ణ సినిమా షూటింగ్‌లొ పాల్గొన్నారట. చేసేదిలేక కృష్ణ ఆ క్యారెక్టర్‌కి బాలయ్యని పెట్టి పూర్తి చేశారట. అసలు ఎన్టీఆర్‌కి పొటీ అంటే ఎస్వీఆరే అని..ఆయన్ని హాలీవుడ్ నటులతొ పొల్చడం కూడా సరికాదని కృష్ణ అభిప్రాయం. ప్రమాణాలు ఏవైనా ఉంటే..ఎస్వీ రంగారావువి హాలీవుడ్‌ని మించిన నటన అని ఆయన ప్రశంసిస్తారు.

విలనిజంలొనూ సునిశిత వ్యంగ్యం కన్పించే పాత్ర దేశొద్దారుకుడులొ అయితే, పెద్దరికం-మతిమరుపు కలబొత తొడికొడళ్లు సినిమాలొని పాత్ర, ఘటొత్కజుడిగా ఇంకెవరినైనా తెలుగువారు ఇంకొ వందేళ్లకైనా ఊహించుకొగలరా..
సాంఘిక చిత్రాలలొ అసమాన నటన ఎస్వీఆర్ సొంతం. తాతామనవడులొ కరుణ,దైన్యం మూర్తీభవించిన తండ్రి పాత్ర ఎప్పటికీ ఎవరూ మరవలేరు. సుఖదుఖాలు, బాంధవ్యాలు, రాము, ఆత్మబంధువు , పండంటి కాపురం ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చేంతాడంత అవుతుంది..నవరసాలు పలికించగల దిట్ట  ఎస్వీ రంగారావు
ఐతే అంతటి గొప్ప ఎస్వీ రంగారావు చనిపొయే ముందు వరకూ చేతినిండా సినిమాలు ఉన్నా..దుర్వ్యసనాలను వదులుకొలేకపొయారట . 1974 ఫిబ్రవరిలొ ఒకసారి గుండెపొటు రాగా కొలుకున్నారట..ఐతే తిరిగి జులైలొ వచ్చిన స్ట్రొక్ మాత్రం ఆయన ప్రాణాన్ని తీసుకుపొయింది..ఆయన మాత్రం తెలుగుచలనచిత్ర అభిమానుల గుండెల్లొ ఎప్పటికీ నిలిచిపొయారు

Comments