ఆ సూపర్ స్టార్స్ హోమో సెక్సువల్సా...? ఇంతకీ ఎవరా స్టార్స్


లెస్బియన్, గే, హోమోసెక్సువల్స్ ఇలా రకరకాల వర్గాలుగా స్వలింగ సంపర్కులను చెప్తుంటారు. సుప్రీంకోర్టు కూడా వీళ్లకి అనుమతి ఇస్తుందనే సూచనలు కన్పిస్తున్నాయ్. ఫైనల్ గా ఇంతవరకూ ఈ తీర్పు రాకపోయినా చాలామంది ఈ ప్రచారాన్ని సమర్ధిస్తున్నారని చెప్తున్నారు. సృష్టి జరగాలంటే పురుష స్త్రీ జాతి ఉండాలి. ఇందుకోసం కాపురం చేయడమనేది అవసరం ఇదే దేవుడి నియమం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం.
 ఐతే ఒకే జాతికిచెందిన వాళ్లు  రకరకాల కారణాలతో సంసారం చేయడం సృష్టికి విరుధ్దమని భారతదేశంలో మెజార్టీ ప్రజలు అంటారు కానీ పాశ్చాత్యదేశ ప్రభావాలతో ఈ నియమాలకు కూడా తిలోదకాలు ఇస్తున్నారు. మామూలుగా ఉన్న రోజుల్లోనే పసిపిల్లలపై , వృధ్దులపై కూడా అత్యాచారాలు జరుగుతున్న కాలంలో ఇప్పుడు ఇలా స్వలింగ సంపర్కానికి కూడా కోర్టు అనుమతి దక్కుతుందని ప్రచారం జరగడం దారుణం
ఎందుకంటే ఇది నైతికతకు సంబంధించిన అంశం. దీన్ని చట్టం చట్రంలో బిగించడం సరికాదు..మన స్టోరీ విషయానికి వస్తే ఇలా స్వలింగ సంపర్కాన్ని ఎంకరేజ్ చేసే బ్యాచ్ ఒకటి బాలీవుడ్ లోనూ తయారైంది. మహికా శర్మ అనే నటి ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ స్టార్లు అని ఎవరిని పిలుస్తున్నారో వారు కూడా హోమో సెక్సువల్సే అంటోంది. దీంతో ఉలిక్కిపడటం బాలీవుడ్ వంతైంది.
ఎంత కాదనుకున్నా.. బాలీవుడ్‌లో ఈ కల్చర్ ఎక్కువగానే ఉంది. ఐనా కూడా టాప్ స్టార్ల పేర్లు ఈ లిస్టులో ఇంతవరకూ బైటికి రాలేదు. అలాంటిది ఉన్నట్టుండి మహికాశర్మ ఇలాంటి కామెంట్ చేయడం వారి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించేదే. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అంటే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్..వీరితో పాటు లిస్ట్ ఇంకాస్త్ ఎలాబరేట్ చేస్తే రణ్ వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ కూడా వస్తారు. వీళ్లలో ఎవరు హోమోసెక్సువల్సో ఎవరిని ఉద్దేశించి మహికా శర్మ ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియాల్సి ఉంది. ఆమె వాదన ప్రకారం స్వలింగ సంపర్కులకు స్వేఛ్చ కల్పించాలట. ఓ మనిషిగా ఎవరి స్వేఛ్చ వారికి ఉంటుంది. కానీ వారి స్వేఛ్చ ఇతరులకు ఇబ్బందిగానూ, సమస్యలు తెచ్చిపెట్టేదిగానూ ఉంటే అది అర్ధం లేనిదిగా తయారవడం ఖాయం

Comments