కాపు సెగ ప్లస్ అవుతుందా..మైనస్ అవుతుందా జగన్ స్ట్రాటజీ ఏంటి


చడీ చప్పుడూ లేకుండా వచ్చి పడ్డ పిడుగులా వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్లపై తన వైఖరి చెప్పారు. అందులోనూ కాపులకు బాగా పట్టు ఉంది అని చెప్పుకునే తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలా ప్రకటించడం నిజంగా ఓ షాక్..ఇది ఖచ్చితంగా వైఎస్ జగన్‌కి మైనస్ పాయింట్ అవుతుందని ఎల్లో పేపర్లు..మీడియా పండగ చేసుకుంటున్నాయ్. తాము అధికారంలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయి టిడిపి నేతలు కూడా జగన్ మాటలను
ఖండించడంలో బిజీ అయిపోయారు. కానీ వాస్తవానికి వైఎస్ జగన్ చెప్పింది రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వాల పరిధిలోని అంశం కాబట్టి నేను ఆ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వను అని. అంతేకానీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తాను వ్యతిరేకిస్తా అని చెప్పలేదు. ఐతే తనంతట తాను రిజర్వేషన్లను ఇస్తా అని చెప్పలేదు కాబట్టి ఇది ఆయనకి వ్యతిరేకించే పరిణామాలు ఎక్కువ. పైగా గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే అని నొక్కి చెప్పారు.  ఆ ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. డైరక్డ్‌గా తానే అధికారంలోకి రాగానే ఇస్తా అని మాత్రం అనలేదు ఓ వేళ అన్నా కూడా ఇప్పుడు తన వైఖరి చెప్పాడు కాబట్టి భవిష్యత్తులో ఆ విషయంపై తనకి ఇబ్బందులు తలెత్తకుండా చేసుకుంటున్నాడని అర్ధం చేసుకోవచ్చు
తాత్కాలికంగా మాత్రం వైఎస్ జగన్ ప్రకటన కాపుల్లో కాక రగిల్చింది. ఏంటిది ఇలా చేశాడు..నిన్నటిదాకా తమకి మద్దతు ఇస్తున్నట్లు కన్పించిన వైఎస్ జగన్ ఇలా చేసాడంటనే ఆవేదన వారిలో ఖచ్చితంగా కన్పిస్తుంది. ఐతే ఇవ్వలేని వాటిని తాను హామీ ఇవ్వను అని చాటి చెప్పడమే జగన్ ప్రకటన లక్ష్యంగా కన్పిస్తుంది.ఇదే విషయాన్ని రేపు ఎన్నికల ప్రచారంలో తీసుకువెళ్తాడని అంటున్నారు. రుణమాఫీ జరిగినా జరగకపోయినా..జరగలేదనే జగన్ చెప్తున్నారు. అలానే కాపుల రిజర్వేషన్ల అంశం కూడా చంద్రబాబు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని జగన్ విమర్శలు చేస్తారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో తనకి డ్యామేజీ జరిగేదానికన్నా కూడా చంద్రబాబు, టిడిపికి
జరగబోయే డ్యామేజే ఎక్కువ అని జగన్ ప్లాన్‌గా చెప్తున్నారు. ఈ మధ్యనే పవన్ కల్యాణ్‌పై యధాలాపంగా చేసిన విమర్శలు కూడా కలకలం రేపాయి.

ఇప్పుడు కాపు రిజర్వేషన్ల విషయం కూడా ఇలానే వైఎస్సార్సీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే విషయంపై పార్టీలోనే కాపు నేతలు కూడా ఏ విధంగా స్పందించాలో తెలీని పరిస్థితి. ఎందుకంటేపైకి ఏం చెప్పినా...బాబు ఛానళ్లు చర్చకి పిలిచి మరీ కార్నర్ చేస్తున్నప్పుడు సమర్ధించుకోకతప్పదు. కానీ ఇలా ఆ అంశంపై మాట్లాడేకోద్దీ కాపులను రెచ్చగొట్టినట్లే ఐతే వైఎస్ జగన్ కాపుల ఓట్లు ఖచ్చితంగా చీలినప్పుడు అది టిడిపికి వ్యతిరేకంగా పరిణమిస్తాయని అనుకుంటున్నాడట. పైగా కాపులకు బిసీలను చేర్చడమనే విషయంపై ఇప్పటికే బ్యాక్ వార్డ్ క్యేస్ట్‌లలో ఉన్న కులాల జనం మండిపడుతున్నారు. వారంతా కూడా జగన్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు..అందులో వాస్తవాలు.. ఎలా ఉన్నా..నిజంగా జగన్ ఓ ప్లాన్ ప్రకారమే ఇలా చెప్పారా లేదా అనేదే తెలీదు. ఇక ఆ రహస్యవ్యూహం ఫలిస్తుందో లేదో ఎన్నికల నాటికి మాత్రమే తెలుస్తుంది

Comments