బ్రహ్మానందం...ఎలా ఉండేవాడు ఎలా ఐపోయాడో, పెరుగుట విరుగుట కొరకే


నటుడు బ్రహ్మానందం దురదృష్టం కొద్దీ హీరో కాలేదు..ప్రేక్షకుల అదృష్టం కొద్దీ కమెడియన్ అయ్యాడు ఈ కామెంట్ చేసింది ఒక దర్శకుడు. ఆయన పరమార్ధం ఏమిటంటే..అన్ని రసాలూ పండించగల ప్రతిభ బ్రహ్మానందం సొంతమని..ఆ మాట విషయానికి ఏమో కానీ..తెలుగు ఇండస్ట్రీలో 1990ల నుంచి 2014 వరకూ తిరుగులేని స్టార్ కమెడియన్‌గా రాజ్యమేలాడు ఆయన. అసలు ఓ దశలో
కమెడియన్ల గ్యాంగ్ అంతా ఈయనగారి మోనోపలీని సెట్లపై తమతో ప్రవర్తించే తీరుని తీవ్రంగా తప్పుబడుతూ ప్రెస్‌మీట్లు పెట్టిన రోజులు కూడా ఉన్నాయ్. లేడీ ఆర్టిస్టులు ఒకరిద్దరితొ అసభ్యంగా ప్రవర్తిస్తాడని కూడా బ్రహ్మీపై ఆరోపణలు ఉన్నాయ్..సీన్ ఇక్కడ కట్ చేస్తే..
ఇప్పుడు బ్రహ్మానందం చేసే సినిమాలు వెతుక్కోవాల్సి వస్తుంది..ఒకప్పుడు రోజుకి ఇంత అని రెమ్యునరేషన్ లెక్కగట్టి తీసుకున్న బ్రహ్మీ ఇప్పుడు కనీసం ఏడాదిలో ఒక్క సినిమా రిలీజైనా చాలు అన్నట్లుగా పరిస్థితి దిగజారిపోయింది
అదీ కాకుండా తెలుగుసినిమా పరిశ్రమలో ఉన్న పేరున్న ప్రతి దర్శకుడూ బ్రహ్మానందంతో తమదైన శైలిలో హాస్యం పిండుకున్నారు. ఇందులో బూతు పాత్రలు ఉన్నాయ్. మంచి పాత్రలూ ఉన్నాయ్. అదీ కాకుండా ఒకేరకమైన హావభావాలు, మాడ్యులేషన్ కూడా ఇప్పటి యూత్‌కి నచ్చడం లేదని అందుకే బ్రహ్మానందాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు.

 ఒకప్పుడు రోజుకి రెండు లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకూ డబ్బు తీసుకున్న ఈ హాస్యనటుడు ఇప్పుడు కాల్ షీట్‌కి యాభైవేల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇది కూడా తక్కువ కాదు కానీ ఇదే రెమ్యునరేషన్ ఆయన పాతికేళ్ల క్రితం తీసుకునేవాడు, చిత్రం భళారే విచిత్రం హిట్టైన తర్వాత బాబూమోహన్, కోట, బ్రహ్మానందం కాంబినేషన్లో తెగ సినిమాలు వచ్చేవి..అప్పట్లో ఈ ముగ్గురూ తమ క్రేజ్‌కి తగ్గట్లు డబ్బు డిమాండ్ చేసి నటించేవాళ్లు..అప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్‌కి ఇప్పుడు బ్రహ్మీ మళ్లీ  పడిపోవడం చూస్తే పెరుగుట విరుగుట కొరకే అనే సామెత నిజమైందనే చెప్పాలి

Comments