వాటేసుకున్న రాహుల్ గాంధీ..బిత్తరపోయి షాక్ తిన్న మోడీ


రాహుల్ గాంధీ ఇవాళ లోక్‌సభలో కేకలు పుట్టించారు.. ఈ వాక్యప్రయోగానికి నిజమైన అర్ధం సభలో కన్పించింది కూడా. రాహుల్ చేసిన పనికి మిగిలిన ఎంపిలు కేకలు పెట్టారు. అది హర్షాతిరేకంతో కావచ్చు..హేళనగా కావచ్చు. కానీ ఏపికి జరుగుతోన్న అన్యాయం( తమ పార్టీ చేసినది కూడా చెప్పుకోవాల్సింది) మోడీ నిష్క్ర్రియా పర్వతం గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ..తనలోని రకరకాల కోణాలను చూపించాడు.
"నాపై మీ హృదయంలో చాలా క్రోథం ఉంది. కానీ నా మనసులో మాత్రం ప్రేమ తప్ప ఏం లేదు..ఇవాళ మీ మనసులోని ద్వేషాన్ని పోగొడతాను చూడండి" అంటూ సడన్‌గా రాహుల్ గాంధీ..తన వరస నుంచి చుట్టూ తిరిగి వచ్చి మోడీ దగ్గర కాసేపు మాట్లాడాడు. దానికి మోడీ కాస్త మొరటుగా ఏదో అనడం కన్పించింది. వెంటనే రాహుల్ గాంధీ ఆయన్ని కౌగలించుకుని ఓ ఐదు సెకన్లు అలానే ఉండిపోయాడు. పాపం మోడీకి ఏం చేయాలో అర్ధం కాలేదు..అలా చూస్తుండిపోయాడు..తనని దాటుకుని రాహుల్ వెనక్కి వెళ్లే సమయంలో తేరుకుని వెనక్కి పిలిచాడు. పిలిచినా తిరిగి ఏం చేయాలో తెలీని స్థితి. వెంటనే రాహులే మళ్లీ ఆలింగనం చేసుకోబోగా..భుజం తట్టినట్లు అభినయించాడు మోడీ పాపం..

ఒక్కసారిగా సభలో చప్పట్లు..కేకలు అరుపులు..ఈ దెబ్బతో రాహుల్ గాంధీ భలే ట్విస్ట్ ఇచ్చాడు గా అన్పించింది
ఇంకా హైలైట్ కాని అంశమేమిటంటే.." నేను మీ దృష్టిలో పప్పునే కావచ్చు..కానీ కాంగ్రెస్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది" అని చెప్పడం ద్వారా రాహుల్ తన ఇమేజ్ ఎక్కడికో పెంచుకున్నాడు..అలా రాహుల్..అవిశ్వాస తీర్మానాన్ని తనకి అనువుగా మలచుకోవడంలో వంద మార్కులు సంపాదించుకున్నాడు

Comments


  1. పప్పూ భాయ్ కాంగి రెస్ :)
    మున్నాభాయి ఎమ్ బీబీ యెస్ లా‌ :)


    జిలేబి

    ReplyDelete
  2. Really. Seems you had very low expectation from Rahul.

    ReplyDelete

Post a Comment