కత్తికి పిడి దిగినట్లే..దేవుళ్లే కదా ఏమైనా అంటే సరిపోద్దా


కత్తి మహేష్ అనబడు వ్యక్తి కేవలం ఇంకొకరిపై విమర్శలు చేస్తూ ప్రచారంలోకి వచ్చాడు. అలానే కేవలం ఆయన
వృత్తి కూడా సినిమాలను విమర్శించడమే.అలాగని ఏది పడితే అది మాట్లాడితే పెద్ద గొప్ప అయిపోదు. పైగా అసలుకే ఎసరు రావచ్చు అదే కొంతమంది విషయంలో జరిగింది కూడా..! దైవాన్ని నమ్మకపోవడం వేరు, అసలు దేవుళ్లని..దైవాన్ని నమ్మేవాళ్లపై విషం కక్కడం వేరు

రాముడు అలాంటి వాడు ఇలాంటి వాడని రెచ్చిపోతూ ఉంటే టివిఛానళ్లు రేటింగులు పెంచుకోవచ్చు కానీ,చూసే జనం కూడా బిపి పెంచుకుంటారు.అదే ఊపులో ఎవరైనా మనోడి తలపై పెద్ద బండ పడేశాడనుకోండి..అప్పుడెలా ఉంటుంది. నోరు చేసిన పాపానికి తల పగిలి చివరకు పైకే పోవచ్చు కదా..ఇక్కడ ఒక వ్యక్తి వాక్ స్వాతంత్ర్యపు హక్కు గురించి మాట్లాడటం లేదు..మన ప్రజాస్వామ్యం ఎక్కడ పూర్తవుతుందంటే..అవతలివారి ముక్కు దగ్గర. అంటే..కర్రతో నీ ఇష్టం వచ్చినట్లు తిప్పుకో..కానీ ఆ కర్ర అవతలివాడికి తగిలిన మరుక్షణం అది స్వేఛ్చ కాదు నేరంకింద మారుతుంది. ఇది తెలిసి కూడా అలానే ప్రవర్తించేవారు ఒకటి మూర్ఖులు అవుతారు లేదంటే తద్వారా తనపై భారీగా కుట్ర జరుగుతుందంటూ ప్రచారం చేసుకుని పేరు తెచ్చుకుందామనుకునే చావు తెలివితేటలు ఉన్నవాళ్లు.

ఇప్పుడదే పని చేసాడు సదరు మహేష్..ఇక్కడ హైందవేతర, ముస్లిమేతర..క్రిస్టియనేతర మతం గురించి కాదు మాట్లాడేది..ఎవడు మాట్లాడినా వాళ్ల నమ్మకం వరకే మాట్లాడాలి కానీ..నీ నమ్మకాన్ని ఎగతాళి చేస్తా..నిన్ను రాయి పెట్టి కొడతా నువ్ మాత్రం సహనంతో ఉండాలి అంటే..అంతిమంగా అది శాంతిభద్రతల లేమికి దారి తీస్తుంది. అందుకే మనదేశంలో ఇతర మతాలపై ఎవరైనా కామెంట్లు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది. దురదృష్టం ఏమిటంటే..ఎక్కడ హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకుంటే..అది మతం రంగు పులుముకుంటుంది. అందుకే వీటిని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు..కానీ అది కూడా ఓ దశవరకే సహిస్తారని తెలుసుకోవాలి. ఓ వర్గం పూజించేవాళ్లపై రాళ్లేసి ఆనందించడం శాడిజం పైగా ఎవడో నన్ను చర్చలోకి లాగాడు..నేను సమాధానం ఇచ్చాను అంటే కుదరదు..ఇదే ధైర్యం ఇతర మతాలపై చేసి చూస్తే..తెలుస్తుంది ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా..కోర్టులో ఆయన చేసే వాదన ఏంటో జడ్జికి తెలియాలి..లేదూ జడ్జి ముందు కూడా స్వేఛ్చా స్వాతంత్ర్యాల ప్రసక్తి తెస్తే..ఆ రెండూ హరించుకుపోవడం ఖాయం

Comments


  1. *దేవుడు 🙏🙏 మనల్ని ఏం చూస్తాడులే అని అడ్డదారిలో సంపాదించేసి ఇస్టమొచ్చినట్లు ప్రవర్తించి స్రుష్టికర్తనే ఆడిపోసుకునే మూర్ఖులకు ఆసుపత్రిలో రోజులు లెక్కపెట్టేప్పుడు*

    *తలుపు మీద ఇలా రాసి ఉంటుంది..*
    *I C U*

    ఎదుటవాడి మౌనం ని మంచితనాన్ని చేతకానితనంగా బావించి విర్రవీగితే పడుకున్న సింహాన్ని తోక కరిచిన కుక్క లా బావించాల్సిందే.

    వాక్కు స్వాతంత్రం అంటే ఎదుటవాడి మీధ వాంతి చేసుకొమని కాదు. పిచ్చి కి పరాకాష్ట ఈ తుప్పుకత్తి.

    ReplyDelete

Post a Comment