సినిమా ఇండస్ట్రీనా ఇది నేరగాళ్ల మాఫియానా


సినిమారంగం అంటే రంగుల లోకం అని తెలుసు కానీ ఈ మధ్యన అక్కడ విన్పిస్తున్న కథలు వింటే మాత్రం ఇంత చెత్త పేరుకుపోయిందా అన్పించకమానదు. ఏ రంగంలో ఇలా లేదు అని ఓట్రించవచ్చు కానీ..ప్రతి సినిమాలో ఏదోక దృశ్యంలో నీతులు చెప్పే వీళ్లు ఇలా చెడ్డదారిలో నడుస్తున్నారంటే ఏవగింపు కలగకమానదు. కన్నడంలో ధర్మా అనే నటుడు ఉన్నాడు. ఇతగాడు విలన్ పాత్రలు వేస్తుంటాడు..నిజంగా కూడా మనోడి క్యారెక్టర్ అదే అని ఇప్పుడు పోలీసులకు అందిన ఓ కంప్లైంట్ ద్వారా తెలుస్తోంది. ఒక సినిమా నటిని ట్రాప్ చేసి బ్లూ వీడియో తీసి
ఆనక బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట..ఇలా ఇప్పటికే పదిహేనులక్షల రూపాయలు పోగు చేసిన ఇతగాడి టార్చర్ పెరిగిపోవడంతో సదరు నటి పోలీసులకు కంప్లైంట్ చేసింది.
 ఐతే బెంగళూరు పోలీసులు మాత్రం ఇదంతా పట్టించుకోకుండా ధర్మా దొరకడం లేదని చెప్తున్నారట  విషయంలోకి వెళ్తే..ఫలానా రోజున షూటింగ్ ఉందని చెప్పి ఈ నటిని ఓ స్పాట్‌కి రప్పించారట. తీరా అక్కడికి వచ్చిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారట. సదరు ధర్మా, అతగాడి కారు డ్రైవర్ నవీన్ ఇద్దరూ కలిసి ఈ నటితో లంచ్ చేసారు..కానీ లంచ్ చేసిన తర్వాత జ్యూస్ తాగించారట.

ఆ జ్యూస్‌లో మత్తు మందు కలపడంతో ఈ నటి స్పృహ కోల్పోవడం ఆ తర్వాత ఈ ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారట. అదంతా వీడియో తీసి తర్వాత ఈమెని బెదిరించడం ప్రారంభించారట. అలా ఇప్పటికి 15లక్షలు కాజేశారు. ఐనా వాళ్ల దాహం తీరకపోవడంతో ఇక చేసేదిలేక కంప్లైంట్ చేసిందీమె. ఇదీ ఈమె కథనం..పోలీసులు ఇంకా స్పందించలేదు. ఇక స్పందించిన తర్వాత పోలీసులు రొటీన్ డైలాగ్సే వేస్తారు. కానీ ఈ వ్యవహారం చూస్తుంటే
పని చేసే చోట మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిసి వస్తుంది. ఐతే ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇలా మోసం చేసే దుర్మార్గులు ఉన్నప్పుడు  శీలం కోల్పోవడమే కాకుండా, ఇంకా ఆ తర్వాత బెదిరింపులకు గురవ్వాల్సి రావడం ఇంకా ప్రమాదకర పరిస్థితి. ఇలాంటి కేసుల్లో ఒకరిద్దరికి భారీ శిక్షలు పడినప్పుడు మాత్రమే ఏదైనా ప్రయోజనం. ఎందుకంటే మలయాళంలో దిలీప్ గాడి నిర్వాకం చూసిన తర్వాత అతగాడికి శిక్ష పడుతుందనుకున్నారు. కానీ కొన్ని రోజులకు బెయిల్ దొరకడం తర్వాత తిరిగి అసోసియేషన్‌లో జాయినవడం చూస్తే..చట్టాలు కాదు ముందు మారాల్సింది మనుషులే అన్పించకమానదు. ఇన్ స్టంట్ జస్టిస్ దొరికిన రోజు
నేరగాళ్ల ఆలోచనలు మారతాయి. శిక్షిస్తారనే భయమే లేనప్పుడు ఇక నేరగాళ్లకి భయం ఎలా ఉంటుంది

Comments