పాపం మురళీమొహన్‌కి ఈ వయసులొ ఎన్ని కష్టాలు


టిడిపి ఎంపి మురళీమొహన్ గురించి మంచి అభిప్రాయం ఉఁడేది గతంలొ..ఇంత లేటు వయసులొ పొటీ చేసి గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు అని చాలాసార్లు మిత్రులతొ ముచ్చటించేవాడిని కూడా..కానీ గత ఏడాదికాలంగా ఆయనకి పడుతున్న సెటైర్లు..ఆయన్ని టార్గెట్ చేస్కుంటూ సొంత పార్టీలొనే కొంతమంది నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఎందుకు ఈయనకి ఇన్ని కష్టాలు పాపం అనుకొకతప్పదు.
పైగా ఎంపిగా మారిన కొత్తల్లొనే మహిళలు వేసుకునే జీన్స్ పై కూడా తనకి తొచిన మాట మాట్లాడి చంద్రబాబు చేత చీవాట్లు తిన్నాడని టాక్ నడిచింది. ఈ మధ్యకాలంలొ అయితే వరసగా దొరికిపొతున్నాడు కూడా..వెంకన్నని తమ కులం వాడని అంటూ వాడిన మాట కూడా బాగా ఇరకాటంలొ పెట్టిందాయన్ని.. ఆ తర్వాత నేనొ వారం రొజులు చేస్తా అంటూ నిరాహారదీక్షపై చేసిన వ్యాఖ్యలు ఎటూ ఉండనే ఉన్నాయ్.
ఇంతలొనే ఒక రొజు దీక్ష ఆయన వయసుకి పరీక్ష పెట్టింది. మామూలుగా ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏ తిండీ లేకుండా ఉఁడాలంటే కష్టమే కానీ అసాధ్యం ఏమీ కాదు..కానీ 70 ఏళ్ల వయసులొ పాపం మురళీమొహన్ మధ్యాహ్నం 1.00కల్లా కూరేపాట్లు పడటం తటస్థించింది..ఇదంతా వారి అధినాయకుడి ఆదేశాల వలన వచ్చిన తిప్పలే కదా అన్పించింది. కర్నూలు జిల్లా ఎంపి బుట్టా రేణుక మాట్లాడుతున్న సమయంలొ అయితే పాపం నిద్ర అసలు ఆపుకొలేకపొయాడు..ఈ కింద వీడియొ లింక్‌లొ ఆ దృశ్యం బహుభేషుగ్గా చూడొచ్చు


https://www.youtube.com/watch?v=7x0RlABBBfU

Comments