ఈ ఇద్దరు యువహీరొలది బ్రాహ్మణకులం కావడం వల్లనే అడ్రస్ లేకుండా పోతున్నారా..!


తెలుగు సినేమా ఇండస్ట్రీలో కులజాడ్యం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ఋజువు అయింది. కొంతమంది కూర్చుని అలాంటిదేం లేదు, ఇక్కడ కేవలం టాలెంటే ముఖ్యం అని సుద్దులు చెప్తే చెప్పవచ్చు కానీ..ఎంత ప్రతిభ ఉన్నా, అవకాశాలు రావాలంటే మాత్రం కులం కార్డు వాడకతప్పని పరిస్థితి నెలకొని ఉందనే చెప్పాలి. ఇంకో అడుగు ముందుకు వేస్తే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, కమ్మ, కాపు కులస్తులు కాని ఇతర కులాల వారికి అవకాశాలు రావడం కష్టమని అంటారు కూడా.. ఎంతో టాలెంట్ ఉండి, బ్యాక్ గ్రౌండ్ ఉండి రేసులో వెనుకబడిన ఆది, బాలాదిత్య గురించే చెప్పుకుంటే ఈ ఇద్దరూ బ్రాహ్మణకులానికి చెందినవారు కావడం వల్లనే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని విమర్శలు, ఆరోపణలు ఉన్నాయ్.



బాలాదిత్య విషయానికే వస్తే చిన్నతనంనుంచీ సినిమారంగంలో పాత్రలు చేస్తూ..హీరోగా మారిన అతి కొద్దిమందిలో బాలాదిత్య ఒకడు. సుందరానికి తొందరెక్కువ, చంటిగాడు, 999, కీలుగుర్రం  వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా..అగ్రహీరోలు, వారసుల దూకుడును తట్టుకోలేక వెనక్కిపోయాడు. మధ్యలో కొన్ని సిినిమాలకు ఈయన పేరును పరిశీలించినా..ఎందుకండీ అతను మనోడు కాదు కదా అని నిర్మాతలు పక్కనబెట్టేవారట. చేసేదిలేక చిన్న చిన్న టీవీషోలు నడిపిస్తూ బండి లాక్కొస్తున్నాడు.


అలానే ఇంకో హీరో గురించే చెప్పుకుంటే ఆది..బ్యాక్ గ్రౌండ్ తక్కువేం కాదు. తాత పిజె శర్మ కష్టాలు పడి కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొస్తే..తండ్రి సాయికుమార్ అంతకంటే ఎక్కువ కష్టంతో హీరోగా మారి ఓ ట్రెండ్ సెట్ చేశాడు. తెలుగులో హీరోగా చేసినవి పదికంటే ఎక్కువ లేకపోయినా..కన్నడంలో మాత్రం సాయికుమార్ హీరోగా 50 సినిమాలకి పైనే చేశాడు. అంత నేపధ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో ఆది కెరీర్ సాఫీగానే సాగిపోతుందని అంచనాలు ఉండేవి..ఐతే ఈ 8 ఏళ్ల కెరీర్లో కేవలం 10 సినిమాలు మాత్రమే చేయగలిగాడు..ప్రతి సినిమా పరాజయం పాలైంది. అండగా నిలబడేవారే లేకపోవడంతో సినిమాలు పూర్తైనా రిలీజ్ చేసుకునేందుకు థియేటర్లు కూడా దొరక్క కొన్ని మిస్ ఫైర్ అయ్యాయ్. అందం, ప్రతిభ, అభినయం, నృత్యం, ఫైట్లు ఇలా అన్ని కేటగరీల్లో మంచి మార్కులు పడినా..ఆది హీరోగా నిలదొక్కుకోలేకపోవడానికి, అవకాశాలు లేకపోవడానికి కేవలం కారణం కులమే అని చాలామంది కామెంట్. దీనికంటే కాలేజీ రోజుల్లో క్రికెట్ లో రంజీ ప్లేయర్ గా రాణించిన సంగతి గుర్తుతెచ్చుకుని కనీసం అటువైపు దృష్టి పెట్టినా మంచి రేంజ్‌లో ఉండేవాడినని ఆది బాధపడుతుంటాడట. వీళ్లిద్దరే కాకుండా ఉదయ్ కిరణ్ కనుమరుగు కాగా..సాయి కిరణ్ తెరమరుగు అయ్యాడు. ఐతే ఇలాంటి కథల వెనక ఇతర కుల పెద్దలు కానీ..ఇతరులు కానీ చెప్పొచ్చేదేమంటే ఇక్కడ టాలెంట్ లేకుండా ఎవరూ ఎవరినీ ప్రోత్సహించరు..దానికి అనేక కారణాలు ఉంటాయీ అని..కానీ అవి నిజంగా నమ్మే కారణాల్లా ఉండాలి కదా..!

Comments

  1. Mari hero Nikhil , sri vishnu ladi eaa kulam ... vaallu cinima lu tiyyatam ledaaa .... vaallaki background kodaaa ledu ....

    ReplyDelete

Post a Comment