దొంగనోట్లు తయారు చేస్తోన్న లేడీ..అందులోనూ ఓ టివిఆర్టిస్ట్


దొంగనోట్లు తయారు చేయడమే ఓ సిినిమాటిక్ నేరం. అందులోనూ ఫిల్మ్ ఇండస్ట్రికి చెందినవారు ఇన్వాల్వ్ అయితే ఆ ఆసక్తి మరీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఓ లేడీ ఆర్టిస్ట్ ఆ తప్పు చేస్తే..ఇంకెంత ఇంట్రస్టో కదా..అలాంటి ఇన్సిడెంటే కేరళలో జరిగింది. సూర్య అనే టివి ఆర్టిస్ట్ కొల్లాంలోని తన ఇంట్లోనే ఈ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుందట. తన తండ్రి శశికుమార్ ఆధ్వర్యంలో ఈ భాగోతం జరుగుతుండటంతో పోలీసులకు ఉప్పందింది
మేడపైన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గదిలో ఈ వ్యవహారం నడుస్తోందట. పోలీసులు చెప్పిన దానిప్రకారం ఇందులో తండ్రి శశికుమార్ కంటే తల్లి రీమాదేవి హ్యాండే ఎక్కువగా ఉందట. 

సూర్య, శృతి ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కాగా..ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని పోలీసులు మూసినట్లు తెలుస్తోంది. సీరియల్స్‌లో నటిస్తున్న మహిళ కావడంతో ఇందులో నుంచి త్వరగానే బైటపడే అవకాశాలు ఉన్నాయని కేరళ టాక్. ఇలా దొంగనోట్లు ప్రింట్ చేసేందుకు దాదాపు ఐదులక్షల రూపాయలు రీమాదేవి ఖర్చు పెట్టిందట. ఐతే ఇందులో ఇప్పటిదాకా ఎంత మేర దొంగనోట్లు సర్క్యులేట ్ చేశారో తెలీదు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్‌ మీద ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు ఇడుక్కి పోలీసులు చెప్తున్నారు

Comments