అర్జున్ ఇచ్చిన స్ట్రోక్‌కి పాపం విజయ్ డి.కొండకి వెర్రినవ్వే మిగిలింది


గీతగోవిందం ఆడియో విడుదల కార్యక్రమంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయ్. వాటిలో ఒకటైతే మరీ బాగా అందరినీ ఆకర్షించింది. సినిమా హీరో విజయ్ దేవరకొండ నీట్‌గా షర్ట్ వేసుకుని కింద మాత్రం లుంగీ కట్టుకుని ఫంక్షన్‌కి హాజరయ్యాడు. నిర్మాత అల్లు అరవిందే ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్..అందుకే ఆయనే ఈ ఫంక్షన్‌లో ఎక్కువ సేపు మాట్లాడి ఆ తర్వాత వేదికపైకి అందరినీ పిలిచాడు.

 ఈ క్రమంలో హీరో విజయ్ డి.కొండ మాట్లాడుతూ ఈ ఈవెంట్‌కి వచ్చిన బన్నీ అన్నకి థ్యాంక్స్..బన్నీ వాసు గారు నాకు చాలా క్లోజ్‌గా మారాడు. మరి బన్నీ సినిమా కథ ఆయనే చేయాల్సింది ఈ ఫంక్షన్‌కి ఆయన ఎందుకు వచ్చాడో తెలీదు..కథ కోసమా..లేక బన్నీవాసు కోసమా..లేక వాళ్ల డాడ్ అరవింద్ కోసం వచ్చాడో తెలీదు కానీ..చాలా హ్యాపీగా ఉంది అంటూ ప్రసంగం ముగించాడు. మైకు అందుకున్న అల్లు అర్జున్ ఈ మాటలకు వళ్లు మండినట్లుంది. అరే ఎందుకైతే నీకెందుకురా అన్నట్లు సమాధానం చెప్పాడు.

విజయ్ ముందుగా నీకు క్లారిటీ ఇస్తున్నా..సారీ...ఈ ఫంక్షన్‌కి నేను కేవలం బన్నీవాసుకోసమే వచ్చా ఓకేనా అని ప్రసంగం మొదలుపెట్టాడు. దీంతో వెనుక వరసలో ఉన్న విజయ్ దేవరకొండకి స్ట్రోక్ పడ్డట్టైంది.కొద్దిగా ఇబ్బందిగా కదులుతూ వెర్రి నవ్వు నవ్వాడు. పైగా గతంలో విజయ్ దేవరకొండ సినిమాలు వేరు ఈ సినిమావేరు చాలా నీట్‌గా ఉంటుంది ..అనేసిన బన్నీ వెంటనే అసలు విజయ్ దేవరకొండ సినిమాలంటేనే నీట్ కదా..నీవన్నీ క్లీన్ సినిమాలే కదా అంటూ మరో విట్టేశాడు. దీంతో అల్లు అర్జున్ విజయ్ డికి కౌంటర్ సరిగా ఇచ్చాడులే అనుకున్నారు అక్కడి ఫ్యాన్స్

Comments