పాపం విజయ్‌కాంత్..!


సింధూరపువ్వు, పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్ వంటి సిినిమాలతో తెలుగువారికి దగ్గరైన తమిళనటుడు విజయ్ కాంత్..అసలు విజయ్‌కాంత్‌ది తెలుగు కుటుంబమేనంటారు. చిత్తూరు జిల్లా నాయుడైన విజయ్ కాంత్ తర్వాత మద్రాసులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ రేంజ్‌కి చేరాడు. తెలుగులో డైరక్ట్‌గా ఒక్క సినిమాలో నటించకపోయినా తెలుగు సిినిమా ప్రేక్షకులకు బాగా దగ్గర. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడీయన. ముఖ్యమంత్రి కాకపోయినా తన పార్టీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే స్వయంకృతాపరాధంతోనే కేవలం ప్రతిపక్షంలోనే కూర్చుండిపోయాడని చాలా మంది అంటుంటారు. అలాంటి విజయ్‌కాంత్ ఇప్పుడు ఆరోగ్యపరమైన చిక్కుల్లో పడిపోయాడు.

ఇప్పటికే 60ఏళ్లు దాటిన విజయ్‌కాంత్ బాగా లావు అయ్యాడు. గత కొన్నేళ్లుగా ఫిట్‌నెస్ గురించి అస్సలు పట్టించుకోలేదు. ఈ కారణాలతోనే నాలుగు సర్జరీలు కూడా చేయించుకున్నాడట. అలాంటిది ఇప్పుడు విషయం ఇంకాస్త సీరియస్ అయిందట. దీంతో మంచి ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకి పయనం అయ్యాడు.

తన ఫ్యాన్స్ ఎవరూ ఎయిర్ పోర్ట్ కి కూడా రావద్దని ట్విట్టర్లో చెప్పి మరీ విజయ్ కాంత్ వెళ్లడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్ ఇలానే విదేశాల్లో ఉన్నాడు. అలానే నిన్ననే సోనాలిబింద్రేకి క్యాన్సర్ అని తెలిసింది. ఇలాంటి నేపధ్యంలో విజయ్‌కాంత్ అనారోగ్యం చిత్రసీమని అభిమానించేవారికి బాధ కలిగించే అంశమే

Comments