తమిళంలో రఫ్పాడిస్తోన్న ఈ హీరోయిన్ మన తెలుగు అమ్మాయే..పైగా ఒకప్పటి పాపులర్ విలన్ కూతురు కూడా


పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతలాగా, మన తెలుగు ఇండస్ట్రీలో పరాయిభాషలో విజయవంతం అయితే కానీ గుర్తింపు దక్కదు. తమిళంలో పేరు తెచ్చుకున్న తర్వాతే కొంతమంది నటులు తెలుగువారికి ఆనతారు..ఇప్పుడలానే ఓ హీరోయిన్ తమిళ్‌లో ఇరగదీస్తోంది. ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే తక్కువది కాదు. తెలుగుతెరపై ఒకప్పుడు అందమైన విలన్లు ఉండేవాళ్లు. ప్రతినాయక పాత్రలు అయినా చక్కని స్వరం ఉఛ్చారణతో నిండైన విగ్రహంతో ఈ క్యారెక్టర్ చివర్లో అయినా మంచిగా మారితే బావుండు అనేలా ఉండేవాళ్లు..అలాంటి నటుల్లో రాజేష్ ఒకరు. తెలుగులో దాదాపు వందకిపైగా సినిమాల్లో నటించిన రాజేష్ కూతురు గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది..తండ్రి పేరుతో ఐశ్వర్యా రాజేష్‌గా తమిళనాట మంచి పేరు తెచ్చుకుంది ఈమె. తండ్రి నటుడు, తాత అమర్నాధ్ కూడా నటుడు, అలానే  మన హాస్యనటి శ్రీలక్ష్మి కూడా ఈమెకి మేనత్త కావడంతో ఆ పరంపరని కొనసాగిస్తుందని చెప్పొచ్చు.




1990, జనవరి 10న చెన్నైలో పుట్టిన ఐశ్వర్య తాను పెరిగి పెద్దయ్యేటప్పటికే తండ్రి రాజేష్ చనిపోవడం పెద్ద లోటు. చెన్నై ఎతిరాజ్ కాలేజీ‌లో బికామ్ పూర్తి చేసిన ఐశ్వర్య చిన్నప్పట్నుంచీ తాను చూసిన సిినిమా ప్రపంచాన్నే కెరీర్‌గా ఎంచుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఐతే తమిళనాట ఆమె తెచ్చుకున్న క్రేజ్ మాత్రం ఇతర కథానాయికల్లా కాదు. నటనకి అవకాశం ఉన్న పాత్రలతో అక్కడి విమర్శకుల ప్రశంసలందుకుంది. 2010లో సినిమారంగంలో అడుగుపెడితే ఈ ఎనిమిదేళ్లలో 27 సిినిమాలు చేయడం ఈమె జోరుకి నిదర్శనం.డాడీ అనే హిందీ సినిమాలో కూడా హీరోయిన్ గా చేసి హిట్ కొట్టింది..దాంతో పాటు  ఇప్పుడు చేతిలో 9 సిినిమాలు ఉన్నాయి ఐశ్వర్యా రాజేష్‌కి. 2015లో విడుదలైన కాకముట్టై సినిమాకి ఉత్తమ నటిగా తమిళనాడు ప్రభుత్వం అవార్డు కూడా గెలుచుకుంది.

తమిళంలో టాప్ హీరోలుగా చెప్పే ధనుష్, విక్రమ్‌తో ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుండటం మరో విశేషం. ధృవనక్షత్రం, సామి2 సినిమాలు కనుక సక్సెస్ అయితే ఇక ఐశ్వర్యా రాజేష్ కెరీర్ టాప్‌గేర్‌లో పడుతుందని అక్కడి క్రిటిక్స్ టాక్. ఇంత గొప్పదనం దక్కించుకున్నా ఈ బ్యూటీపై మన తెలుగువాళ్ల చూపు పడకపోవడం విచిత్రం. బహుశా ముందు చెప్పినట్లు ఓ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే కానీ, తమ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు ముందుకు రారేమో..!





Comments