తేల్చేసిన మోడీ..జగన్ కూడా అదే స్థాయిలో క్లారిటీ


ప్రసంగాలు ఎంత ధాటిగా చేసినా..చివరాఖరికి చేసే స్పీచ్ మనదైతే ఆ కిక్కే వేరు అన్నట్లుగా నరేంద్రమోడీ తన ప్రసంగంతో అందరి ప్రసంగాలూ తేలిపోయేలా చేశారు. అవును అప్పుడూ చెప్పా..ఇప్పుడూ చెప్తున్నా..ఆంధ్రప్రదేశ్‌కి
విభజన సమయంలో అన్యాయం జరిగింది..దానికి మేం మద్దతుగా నిలబడతాం అని బిగ్గర గొంతుతో పార్లమెంట్‌లో చెప్పిన మోడీ..ఫస్ట్ టైమ్ ఎన్డీఏ నుంచి చంద్రబాబు బైటికి రావడం..ఆ తర్వాతి పరిణామాలను క్లియర్ గా అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు. ఇందులో ఇక నిజం..అబద్దం అనేది దేవుడికి తెలియాలి
"హోదా ఇవ్వడం కుదరదు..14వ ఆర్ధిక సంఘం నిబంధనలు అలా ఉన్నాయ్. కాబట్టి ప్యాకేజ్ ఇస్తామని చెప్పాం..దానికి చంద్రబాబు ఒప్పుకున్నారు..స్వాగతించారు. పొగిడారు. మంత్రులు కూడా హోదాకంటే బెటర్ ప్యాకేజీ ఇచ్చారని స్వయంగా ప్రకటించారు..ఇప్పుడు బైటికి వచ్చారు. " అని చెప్పిన మోడీ..తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పారు.." బాబూ వైయస్సార్ పన్నిన వ్యూహంలో మీరు చిక్కుకున్నారు..మీ రాష్ట్రానికి మేం న్యాయం చేస్తున్నాం" అని చెప్పాను..ఐనా వినలేదు..అందుకే ఈ అవిశ్వాసం..ఇప్పటికీ చెప్తున్నా ఆంధ్రకి అన్యాయం చేయం" ఇలా ముగించేశారు. దీంతో  చంద్రబాబే స్వయంగా ప్యాకేజీని స్వాగతించారనే సంగతిని టిడిపి ఎంపిల ముందే ఎండగట్టడమే కాకుండా..వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రచారం జరగొచ్చనే ఫీలర్ వదిలారు. కాబట్టి ఇక టిడిపి వాదనకి బలం ఉంటుందా లేదా అనేది తర్వాతి సంగతి. ఈ తతంగం ముగిసిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. అదీ ముచ్చటించుకుందాం..కానీ ఎవరినైతే చూసుకుని బిజెపి రెచ్చిపోతుందని చెప్తున్నారో ఆ జగన్ బాబు కూడా మాట్లాడటం విశేషం.
"టిడిపి ఎంపిల వాదనలో కొత్తదనం ఎక్కడుంది..నేను నాలుగేళ్ల క్రితం హోదా గురించి అడిగితే ఎగతాళి చేశారు. రకరకాల విమర్శలు చేశారు..ఇప్పుడు మళ్లీ మేం కుమ్మక్కయ్యామని చెప్పారు..ఇంకోసారి చెప్తున్నా...ఎన్నికలకు ముందు పొత్తులు ఉండవ్..సింగిల్‌గానే పోటీ చేస్తాం..ఎవరు హోదా ఇస్తారో వాళ్లకే నా సంతకం "అని తేల్చేశాడు..ఐతే ఇలా చెప్పడంపైనా విమర్శలు ఉన్నా కూడా..జగన్ క్లారిటీ జగన్ ఇచ్చేశాడు..ఇక పోరు బహుముఖం అని తేలిపోనుంది. ముగ్గురు కలిసి గెలిచిన టిడిపి..సింగిల్‌గా నేరో మార్జిిన్లో ఓడిపోయిన వైఎస్సార్సీపీ..రిజల్ట్ 2019 వెయిట్ చేస్తోంది

Comments

  1. ఎవరు హోదా ఇస్తారో వాళ్లకే నా సంతకం అంటే అర్ధం ఏమిటీ ?ఈయన ముఖ్యమంత్రి అయితే సంతకం పెడితే హోదా వస్తుందా ? ఈయన లోక్ సభలో మద్దతు ఇస్తే హోదా వస్తుందనా ?

    ReplyDelete
  2. ఇదీ 'వై యస్ ఆర్' ప్రపంచం అనిపించారు.
    కాని అదే ప్రపంచం కాదు సుమా.
    అదసలు ప్రపంచమే కాదు కూడా.

    ReplyDelete

Post a Comment