పడక వేషాలు వేయమన్నారంటూ భోరుమన్న మణిరత్నం హీరోయిన్


 చెలియా డబ్బింగ్ మూవీతో..తెలుగు సమ్మోహనంతో మన ప్రేక్షకులకు దగ్గరైన అమ్మాయి అదితీరావ్ హైదరీ తనని కూడా పక్క మీదకు లాగాలని ట్రై చేశారని వాపోయింది. ఆ క్షణాల్లో తాను అనుభవించిన మానసిక వేదన అంతా ఇంతా కాదని ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో చాలా వేషాలు తనకి దక్కలేదని దానికి కారణం, దర్శకులు నిర్మాతలు తనని పడకగదికి రమ్మనడమే అని..అందుకు తాను ఒప్పుకోకపోవడంతో సినిమా ఛాన్సులు దక్కలేదని చెప్పింది
 2013లో తాను బాగా బాధలు అనుభవించిన క్షణాలని..తన తండ్రి చనిపోవడంతో కూడా బాగా డిప్రెస్ అయినట్లు
చెప్పిందామె. అలాంటి రోజుల్లో తన వైఖరి తననెంతో బలంగా చేసాయని చెప్పింది

ఐతే 2014 నుంచి తన దశ తిరిగినట్లు..వేషాలు రావడం తన ప్రతిభ తాను నిరూపించుకోవడం జరిగిపోయాయని అదితిరావ్ హైదరీ చెప్పుకొచ్చింది. ఇలాంటి ప్రలోభాలకు గురైన వారు ఆ విషయాలను పంచుకోవడంలో తప్పు లేదని అదితి అభిప్రాయం. జీవితమంతా ఆ బాధతో బతికేబదులు తమని మోసగించినవారిని రోడ్డుకీడ్చడం సరైన పని అని ఆమె అంటోంది. అప్పట్లో తనతో మిస్ బిహేవ్ చేసేవారి పట్ల వీడికెంత ధైర్యం నన్ను అలా అనుకోవడానకి ిఅని బాగా మండిపడేదట అదితి రావ్ హైద్రీ. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే వేషం కోసం సుఖం అందించాలని డిమాండ్ చేయడం సినిమారంగంలో చెదరని ఓ చేదు నిజం.

వాటిని నివారించాలంటే అది మన వైఖరిలోని మార్పుతోనే తప్ప ఏదో ఎవరో చట్టం చేస్తేనో..లేకపోతే హెల్ప్‌లైన్ పెడితేనో తగ్గేది కాదు..వంటి తీట ఉన్నంతకాలం ఇలా వేషాల కోసం ప్రలోభాలు పెట్టాలనే చూస్తారు. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే దోరణితో పాటు ప్రలోభాలకు లొంగని నైజం అలవడినప్పుడు ఖచ్చితంగా ఈ ధోరణి తగ్గుతుంది. పూర్తిగా రూపుమాసిపోతుందని చెప్పలేం కానీ..ఇప్పటిలా వందకీ వెయ్యికీ పడక పంచుకోవడం..ఆ తర్వాత వేషం ఇవ్వకపోతే నోరు మూసుకుని ఉండటం వంటివి జరగవు.

Comments