కేసీఆర్ వినబడిందా ఈ మృత్యుగోస


ప్రాణహిత-చేవెళ్ల..పేరు మార్చుకుంది కాళేశ్వరంగా..గత ప్రభుత్వాలు..వాటి అధినేతలు పేర్లు ఛాయామాత్రంగా కూడా కన్పించకుండా తన పేరే తెలంగాణ అంతటా ఉండాలన్నట్లుగా ప్రతి పాతనీ కొత్తగా మార్చేస్తానంటూ బయలు దేరి నాలుగేళ్లు దాటింది. ఇప్పుడు అదే కాళేశ్వరం మెదక్ జిల్లాలో బూదమ్మ అనే మహిళ(వృధ్దురాలు) ప్రాణం తీసింది.
లేదూ వృధ్దాప్యం మీదపడి ఆిమే చనిపోయిందని స్కందావారాలు మోత పెట్టొచ్చు కానీ..కాళేశ్వరం కెనాల్ తన పొలాన్ని లాగేసుకుంటుందని తెలిసిన దగ్గర్నుంచీ ఆమె తట్టుకోలేకపోయిందట.

పొలంలొనే కూర్చుని రోజంతా ఏడ్చి..ఏడ్చి..చివరికి అక్కడే ప్రాణం విడిచిందట. ఇదీ ఈ  దేశంలో రైతుకి భూమికి ఉన్న అనుబంధం..ఇదీ తెలీక మేం కోట్లకి కోట్లు నష్టపరిహారం ఇచ్చాం కదా ఇంకేంటి అనే దొరబాబులకు ఇలాంటి సంఘటనలతో అయినా అడ్డగోలు వాదనలతో సమర్ధించుకోవడం మానేస్తారేమో..ఎవరైనా వ్యతిరేకిస్తే..ప్రతిపక్షం కింద కట్టేయడం..అభివృధ్ది నిరోధకులనే ముద్ర వేయడం అలవాటైన చోట ఈ మృత్యుగీతం ఓ చెంపపెట్టే


పెద్ద పెద్ద ఛానళ్లు..ఈ వార్తలను ప్రసారం చేయవ్..ఎందుకంటే ప్రభువులకు కోపం వస్తుంది మరి..ఆపైన ప్రకటనలూ ఆగిపోవచ్చు..లేదంటే ఛానలే కన్పించకపోవచ్చు..ఐతే ఓ ఛానల్ మాత్రం బ్రేకింగ్ వేసి మరీ నడిపింది..ఇక్కడ నిబద్దత కంటే ఇంకో కోణమే కారణమైనా...వార్తను ప్రసారం చేసినందుకు నమస్కారాలు చెప్పాల్సిందే

Comments