హలో బాస్ ఇవాళ ఎలిమినేట్ అయ్యేది(అయ్యింది) శ్యామలాంటీనే


బిగ్‌బాస్ ఎంత ఫార్సు షోనో ఇంకోసారి తెలిసింది..పాపం ఆడియెన్స్ అంతా ఇవాళ ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అనే ఆత్రుతతో ఉంటారని స్టార్ మా టీమ్ అనుకుంటుంటే..ఆ గాలి అంతా తీసేసింది శ్యామల..ఇంటికొచ్చి వీణ వాయించుకుంటున్నా తీరిగ్గా అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసింది..ఇంకేముంది..ఇవాళ రాత్రి ఎపిసోడ్ పెద్దగా పేలదన్నమాటే..అసలే అనుకున్న టార్గెట్ రీచ్ అవడంలేదని ఫీలవుతున్న బిగ్ బాస్ టీమ్ ప్రొడ్యూసర్లకి యాంకర్ శ్యామల చేసిన పని ఇంకాస్త చిర్రెత్తించడం ఖాయం

ఐతే బిగ్‌బాస్‌ షో నుంచి బైటికి వచ్చిన సంజన ఈ షో అంతా డ్రామా అని..విన్నర్ కూడా తెలుసు అని చెప్పడం ఎవరూ పట్టించుకోేలేదు. ఇద్దరు ముగ్గురు జనానిికి తెలీని వ్యక్తులు అంటూ షోలోకి తీసుకున్నవాళ్లు కూడా ఎవరో ఒకరి ప్రోత్సాహంతోనే షోలోకి తీసుకున్నట్లు ఇంకో ఆరు నెలల తర్వాత తీరిగ్గా బైటికి వస్తుంది. అప్పుడు ఈ షో నిర్వాకం బైటపడకతప్పదు. ఎందుకంటే..గతంలోనూ ఇలానే హీరో హీరోయిన్ల కాంటెస్ట్ పేరుతో హడావుడి చేసి ఎన్నిక చేసినవాళ్ల పుట్టు పూర్వోత్తరాలు, అప్పట్లో ఎలా ఎంపిక చేసింది అంతా ఇప్పుడు బైటికి వస్తున్నట్లే ఇదీ బైటపడుతుంది . జెమినీ స్టార్ 2000 కాంటెస్ట్ అని పెట్టిన పొటీలో ఎఁపికైన ఇద్దరిలో ఒకరు రాధ తమ్ముడు కాగా..హీరొయిన్ గా ఎంపికైన అమ్మాయి రాఘవేంద్రరావ్ కుటుంబానికి బాగా తెలిసిన తనూజ అని సౌందర్యలహరి కార్యక్రమంలో తీరిగ్గా సెలవిచ్చాడు. కానీ ఎర్రిపప్పల్లా ఎంతమంది ఆ కార్యక్రమానికి హాజరై బోలెడంత డ్రామా పండించారు

..అలానే చిరంజీవితో నటించే ఛాన్స్ అంటూ థమ్సప్ ప్రకటనలకు పని చేసే సమయంలో హంగామా చేశారు..అప్పుడు ఎంపికైంది శర్వానంద్..ఇతగాడు రామ్ చరణ్ ఫ్రెండ్ అని తర్వాత తెలిసింది..

ఇలా ఉంటాయి సినిమా వాళ్ల లీలలు..అందుకే ఇప్పుడు ఎంపికైన గురుళ్ల భాగోతం కూడా తొందర్లోనే తేలిపోతుంది..
మొత్తానికి ఇవాళ శ్యామల చేసిన పని మాత్రం మా టీమ్ కి షాక్..

Comments