పవన్ కల్యాణ్‌ నీవరకూ అయితే ఇలానా..ఇంకొకళ్లకి మాత్రం అలానా


పవన్ కల్యాణ్ ఇప్పుడు బాగా మాటలు పేల్చుతున్నారు. ఐతే అవి జనం వరకూ చేరడం లేదు. తాను 2014లోనే పోటీ చేద్దామనుకున్నాను అనీ, కానీ చంద్రబాబు తనపై చెడు ప్రచారం చేయడానికి అంకురార్పణ చేయడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పారు. అప్పట్లోనే 60-70 సీట్లలో పోటీ చేద్దామనుకుంటే చంద్రబాబునాయుడుగారు సీట్లు రావు నాకు వచ్చే ఓట్లు చీలిపోతాయి అని చెప్పడం వలన వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. నిజంగా
పోటీకి దిగాలనుకుంటే దిగాలి కానీ..ఇలా చంద్రబాబు చెప్పారని వెనక్కి తగ్గా అని చెప్పడం కరెక్ట్ కాదు..అలానే చంద్రబాబు కూడా ఓట్లు చీలిపోతాయని చెప్పడంలో అర్ధం లేదు. ఎందుకంటే కూటమిగా పోటీ చేస్తే ఓట్లు ఎలా చీలిపోతాయి? అంటే ఇక్కడే ఓ విషయం అర్ధమవుతోంది. 2014 ట్రెండ్ అది...దాని ప్రకారం ఎవరికైతే మద్దతు ఇస్తామో వారు డైరక్ట్ గా రాజకీయాల్లో ఉండకుండా బైటినుంచి మద్దతు ఇస్తున్నట్లు చెప్పాలి..అప్పుడే అందరి ముందూ నీతిమంతుడిలా బిల్డప్స్ ఇవ్వొచ్చు..సబ్బం హరి లాంటి వాళ్లు ఈ కోవలోకి వస్తారు. ఎప్పుడైతే ఓ పార్టీలో చేరడమో పోటీ చేయడమో చేస్తే..వారి మాటలకు విలువ ఉండదు..ఈ వ్యూహంతో 2014లో టిడిపి-బిజెపి కూటమి గెలిచింది.
కానీ ఇప్పుడు రివర్సైంది..అప్పుడు ఏవైతే జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడాడో వాటికే జవాబు చెప్పాల్సి వస్తోంది..చంద్రబాబు జగన్ ఇద్దరిని పోల్చినప్పుడు చంద్రబాబుగారి అనుభవం చూసి ఓటేయమని చెప్పాను అని అన్న పవన్..ఇప్పుడు తానే ఆ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఆయన మాటల్లోనే అయితే టిడిపివాళ్లు అనుభవం లేదని పవన్ కల్యాణ్‌ని ఎగతాళి చేస్తున్నారట. మరి ఈ మాత్రం తెలివిడి జ్ఞానం జగన్ మోహన్‌రెడ్డిని విమర్శించే రోజున ఉండొద్దా...సమస్యలు పరిష్కరించడానికి సీట్లు ఎందుకు అని పదే పదే అతన్ని ఈ మధ్యదాకా టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు అధికారం కోసం రంకెలు వేస్తున్నాడో చెప్పాలి. ప్రతిదానికీ నేను ముఖ్యమంత్రి అయితే పరిష్కరిస్తా అని జగన్ అంటున్నారు అసలు సమస్యల పరిష్కారానికి పదవి ఎందుకు అని ఎద్దేవా చేసిన పవన్ ఇప్పుడెందుకు తనని గెలిపించాలని కోరుకుంటున్నాడో కూడా చెప్పాలి కదా

 అలానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలాగా నేను పారిపోను సభని స్తంభింపజేసేవాడిని అని బీరాలు పలకడం ఎవరూ నమ్మరు ఎందుకంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లనిది గత రెండు సెషన్లు మాత్రమే. పైగా వాళ్లేం ఆషామాషిగా మానేయలేదు. 23మంది ఎమ్మెల్యేలను పార్టీ మారినా కూడా  ఎలాంటి చర్యా తీసుకోనందుకు నిరసనగా చేశామని చెప్తుంటే ఆ విషయం ఎందుకు కన్పించదు..ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ వాదనలా కన్పిస్తున్నా వాస్తవం కాదా పవన్ కల్యాణ్..ఉండవల్లి పెనుమాక గ్రామాల భూముల విషయంలోనూ అంతే..ఎప్పట్నుంచో జగన్ చెప్తున్న విషయమే కదా పవన్ కల్యాణ్ నిన్న చెప్పిందిఅంటే ప్రతి విషయం కూడా నీదాకా వస్తేనే కానీ బోధపడదా..

Comments