హీరో హీరోయిన్ల పెళ్లి..ఇంతలోనే హీరోపై రేప్ కేసు..సినిమా కాదు నిజంగానే..!


మిధున్ చక్రవర్తి గుర్తున్నాడు కదా..డిస్కో డ్యాన్స్‌తో షేక్ చేసిన ఇతగాడు ఇప్పుడు ముదుసలి అయిపోయాడు. ఐతే డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడంతో పాటు డ్యాన్స్ షోలకు వెళ్తూ తన ఉనికి కాపాడుకుంటున్నాడు..ఐతే ఇతగాడికి ఇప్పుడు సన్ స్ట్రోక్ తగిలింది. కొడుకు మహాక్షయ్ చక్రవర్తిపై రేప్ కేసు పెట్టిందో అమ్మాయి. పైగా దీనికి మిధున్ చక్రవర్తి భార్య యోగితాబాలి కూడా సాయం చేసిందని..ఆమెపై కూడా కంప్లైంట్ చేసింది. దీంతో ఈ వయసులో నాకేంట్రా ఈ కష్టాలు అనుకుంటున్నాడు అతగాడు..విషయం ఇక్కడితో అయిపోలేదు..అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది
మిధున్ చక్రవర్తికి కాబోయే కోడలు కూడా హీరోయిన్నే..ఆమె పేరు మదాలసా శర్మ..మీకీ పేరు గుర్తొచ్చినట్లు ఉంది కదా..ఎస్..మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది.



సురేష్ ప్రొడక్షన్స్ తీసిన ఆలస్యం అమృతం సినిమాలో ఈమె హీరోయిన్..అలానే మేం వయసుకు వచ్చాం అని తనీష్ రామ్‌తో కూడా గెంతులేసింది. చిత్రం చెప్పిన కథ తర్వాత హిందీ రామ్‌లీలాలో ఓ క్యారెక్టర్ చేసింది. ఈమె తల్లిదండ్రులు కూడా సినేమారంగానికి చెందినవారే..అందుకే మిధున్ చక్రవర్తి కుటుంబంతో కాస్త రిలేషన్ కూడా ఉందట. అలా ఈ నెలలోనే మహాక్షయ్ చక్రవర్తి, మదాలసశర్మకి పెళ్లి కుదిర్చారు..ఈలోపు మహాక్షయ్ చక్రవర్తి లవర్ వచ్చి ఇతగాడి తిక్క కుదర్చడంతో పెళ్లి అవుతుందా లేదా అని సస్పెన్స్ బయలుదేరింది. 2015నుంచి జూనియర్ మిధున్ చక్రవర్తితో తాను పెళ్లి కాకుండానే కాపురం చేస్తుండగా..గర్భం కూడా వచ్చినట్లు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై కోర్టు కూడా స్పందించి వీళ్లపై ఇండియన్ పీనల్ కోడ్ 90, 25, 415 ఇలా నాలుగైదు సెక్షన్లని వాడుతూ తక్షణం దర్యాప్తు చేయాలని ఆదేశించింది.  ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇక మిధున్ చక్రవర్తి కొడుకుని అరెస్ట్ చేస్తారంటూ బెంగాలీబాబులు గుసగుసలు ఆడుతున్నారు. మహాక్షయ చక్రబొర్తి ఏం అమాయకుడేం కాదు ఫారిన్ భామలతో గ్రంథాలు నడిపాడని,నడుపుతున్నాడని వాటిలో ఇదో కేసు అయి ఉంటుందని బాంబే టాక్. నయం తాళి కట్టేముందు ఇలాంటి సీన్ జరిగితే ఖచ్చితంగా సినిమా చూసినట్లే ఉండేదని మదాలస కుటుంబసభ్యులు అనుకుంటున్నారట


Comments