జనసేనలోకి 20మంది ఎమ్మెల్యేలట..మరి పవన్ నీతి ఏమైంది


 ఏ కొత్త పార్టీలోకి అయినా కొత్త నాయకులతో పాటు పాత లీడర్లు అప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిలు జంప్ అవుతుండటం సహజమే. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. పైగా ఎన్నికలకు ముందు ఈ జోరు చాలానే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు జనసేనలోకి 20మంది ఎమ్మెల్యేలు చేరతారంటూ ఓ లీక్ చేయడం మాత్రం కామెడీనే..ఎందుకంటే 2014కి ముందు ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాతే, ఈ మాత్రం ఊపు ఉండాల్సింది. అది లేదు. పైగా 2016 నుంచి కాస్త స్వరం మార్చినప్పుడైనా కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలైనా ఆయనవైపు చేరాల్సి ఉండేది. అదీ జరగలేదు. ఫరెగ్జాంపుల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంగతే చూసుకుంటే ఆ పార్టీ ప్రకటన రావడమే తరువాయిగా ఎంతమంది ఎమ్మెల్యేలు జెండా పీకేయడం బై ఎలక్షన్లలో గెలవడం అంతా గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 2019 ఎన్నికలు మే నెలలో జరుగుతాయనగా..అంటే ఎనిమిది నెలలు ముందు 20మంది
ఎమ్మెల్యేలు జనసేనలో చేరతారంటూ ప్రచారం చేసుకోవడం విచిత్రం. నిజంగా ఆ చేరేదేదో ఇప్పుడైనా చేరితే పార్టీలో కాస్త ఊపు కన్పిస్తుంది. ఇది రాజకీయం..
కానీ ప్రస్తుత రాజకీయాల పట్ల జనానికి అసహ్యం వేస్తోందని..కొత్త రాజకీయం చేస్తానంటూ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్ వేరే పార్టీల నుంచి వచ్చేవారికి తన పార్టీలో స్థానం ఉండదని చెప్పారు. జంప్ జిలానీలకు తన పార్టీలో చోటు కల్పించవద్దని జనం కోరుతున్నారంటూ కూడా అనౌన్స్ చేశారు. అంటే తానో నిబద్దత కలిగిన నేతగా ఫోకస్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి దశలో ఇప్పుడు రాజమండ్రిలో జనసేన కన్వీనర్ ఒకరు మా పార్టీలోకి 20మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పడం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయో గమనించాలి. బహుశా ఇది తమ పార్టీకి కూడా మిగిలిన పొలిటికల్ పార్టీల్లో క్రేజ్ ఉందని చెప్పుకునే తాపత్రయం అన్పించకమానదు.

 ఎందుకంటే టిడిపిలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యీ..అయ్యీ  ఓ దశలో ఆ పరిణామాలకు బ్రేక్ పడింది. ఐతే ఆ తర్వాత మాజీ నేతలు టిడిపి, కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి కూడా చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ తప్ప వేరే పాపులర్ ఫేస్ లేని పార్టీగా ప్రచారం కాకూడదనే ఇలాంటి లీక్ ఇచ్చినట్లు అంటున్నారు. 

Comments