ఔను..పడుకుంటేనే పైకొస్తారు అన్నాను : నిర్మలాదేవి బరితెగింపు


జీవితం బావుండాలంటే వ్యభిచారం చేయాలా?
తమిళనాడులోని ఓ లెక్చరర్ చేసిన నిర్వాకం బైటపడటంతో అవాక్కయిన జనం..ఇప్పుడామె తన పనిని సమర్ధించుకుంటోన్న తీరు ఇంకాస్త నివ్వెరపోయేలా చేయడం ఖాయం. ఎందుకంటే విద్యార్ధుల లైఫ్ బావుండాలనే కోరికతోనే తాను వాళ్లని పడక సుఖం అందించాలని కోరినట్లు చెప్తుందామె. వ్యవస్థలోని కుళ్లుకి ఇది నిదర్శనమే. తమ పనులు చక్కబెట్టుకునేందుకు పైవాళ్లకి పడతులు పంపాలని అనుకోవడం..వారందించే సుఖంతో పనులు చేయాలని ఆపైవారు భావించడం దౌర్భాగ్యమే

ఇది కొత్త విషయం కాకపోయినా..బరితెగించి మరీ ఇలా, జీవితాలు సుఖమయం కావాలంటే వ్యభిచారానికి మించిన మార్గం లేదన్నట్లు మాట్లాడటమే దారుణం. దీంతో వాళ్లు కోల్పోతున్నది ఏమిటో వారికి తెలియకపోయినా..అందుకు ప్రోత్సహించినవారికైనా తెలుసు కదా చెన్నైలోని ప్రొఫెసర్ నిర్మలాదేవి తాను అలా చేయడం తమ హాస్టల్లోనో కళాశాలలోనో చదువుకుంటున్న యువతులను ప్రోత్సహించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.  తమిళనాడు విరుదునగర్ జిల్లా అరుప్పుకొట్టైలో బైటపడిన ఈ ఘాతుకం విద్యాలయాల్లోనూ చొచ్చుకుపోయిన ఛండాలపు పద్దతులకు అద్దం పడుతోంది. పడక సుఖం అందిస్తే మంచి మార్కులు..తర్వాత మంచి ఉద్యోగం కూడా పొందవచ్చంటూ ఎర వేసిన నిర్మలాదేవి ఉదంతం రెండు నెలల క్రితం కలకలం రేపింది. ఎందుకంటే ఇష్టపడి వచ్చేవాళ్లనే ముగ్గులోకి దింపుతామనే వితండవాదం కుదరదు. ఎందుకంటే ఆ దిగినవాళ్లు మిగిలినవాళ్లను బలవంతంగా వ్యభిచారంలోకి లాగడం. లేదంటే అందుకు తప్ప వేరే చేయలేని పరిస్థితులు కల్పించడం సినిమాల్లో చూస్తుంటారు..ఇప్పుడు నిజంగా కూడా అలాంటివి జరుగుతున్నాయని తెలిసినప్పుడు సమాజంలో
బతుకు భయం భయంగానే వెళ్లదీయాల్సి వస్తుంది.

Comments