హరికృష్ణని చంద్రబాబు ఎలా వాడుకుని వదిలేశాడో తెలుసా



నందమూరి హరికృష్ణ మృతి ఆ కుటుంబ అభిమానులను విషాదంలో ముంచింది. టిడిపి స్థాపించిన దగ్గర్నుంచి చివరిదాకా పార్టీ కోసం పని చేసిన హరికృష్ణ కొన్నాళ్లు విడిగా సొంతంగా పార్టీ పెట్టుకున్నారంటే ఇప్పటి యూత్‌కి తెలీకపోవచ్చు. అన్న టిడిపి పేరుతో ఆంద్రప్రదేశ్‍‌లోని 294 నియోజకవర్గాల్లోనూ పోటీకి అభ్యర్ధులను నిలబెట్టిన పౌరుషవంతుడు హరికృష్ణ. ఇలా ఎందుకు సొంత పార్టీ పెట్టుకున్నాడో తెలియాలంటే దాదాపు పాతికేళ్లు వెనక్కి వెళ్లాలి. 1995లో తండ్రి ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపేందుకు బావ చంద్రబాబు ధైర్యం చేశాడంటే అందుకు హరికృష్ణ తోడ్పాటు కూడా కారణం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావ్ మరి హరి, బాలయ్యలు ఏమంటారో మామగారిని దింపాలంటే అని అడిగిన సమయంలో వాళ్లకేదో చెప్తాం..మంత్రి పదవులు ఇస్తామని చెప్తా అని చంద్రబాబు చెప్పారట. ఈ మాట స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వర్రావే చాలా సందర్భాల్లో చెప్పారు. ఐతే ఆ తర్వాత డ్రామా సజావుగా నడవడానికి హరికృష్ణే మెయిన్ రోల్. ఎందుకంటే అటు పార్టీకి..ఇటు కుటుంబానికి మధ్య వారధిగా పురంధీశ్వరి కంటే ముందు హరికృష్ణే నిలబడ్డారంటారు.

అలా జరిగిన తర్వాత 1995 చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణాశాఖామంత్రిగా హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కూడా కాదు. 1996లో జరిగిన బై ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి హరికృష్ణ 1999 వరకూ మంత్రిగానే పని చేశారు. ముందు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి  ఆ తర్వాత సీటు కూడా ఇవ్వకపోవడంతో బాలయ్య పెద్దగా పట్టించుకోలేదు కానీ, హరికృష్ణ మాత్రం బాగా అవమానంగా ఫీలయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో  ఆయన వారసులకే సీట్లు ఇవ్వకపోవడం కేవలం ఎన్టీఆర్ పేరుని చెరిపివేసేందుకే అని మదనపడ్డారు. ఐతే చంద్రబాబు మాత్రం పార్టీలో ఎన్టీఆర్ విధేయులను మెల్లగా సైడ్ చేస్తూ వచ్చారు. కేవలం తనతో కలిసి వచ్చేవారినే అందలం ఎక్కిస్తూ వచ్చారు. హరికృష్ణ ప్రాపకంతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని కూడా ఆయనకి దూరం చేశారు. అలా పార్టీలో హరిని ఒంటరిని చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోవడంతో 1999 జనవరి 26న అన్న టిడిపి పేరుతో  పార్టీ స్థాపించారు.  ఊరూరా తిరిగి చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఐతే ఎన్నికలలో ఒక్క చోట కూడా గెలవకపోవడంతో అభాసు పాలైనట్లు అయింది. ఇందుకు కారణం మరోవైపు లక్ష్మీపార్వతి కూడా ఎ‌న్టీఆర్ టిడిపి పేరుతో మరో పార్టీని స్థాపించడమే. బిజెపితో కలిసి చంద్రబాబు సారధ్యంలోని టిడిపి ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్, అన్న టిడిపి, ఎన్టీఆర్ టిడిపి, బిఎస్‌పి పోటీకి దిగాయి. దీంతో చంద్రబాబు గెలుపు సాధ్యపడింది. దీనికి మరో  కారణంగా చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంటే కారణమని హరికృష్ణ విమర్శించేవారు. లేదంటే ఎన్టీఆర్‌పై అభిమానం ఉన్న టిడిపి ఓటర్లు ఆయన వారసుడినైన తనని ఎందుకు తిరస్కరిస్తారని ప్రశ్నించేవారు. అలా కొన్నాళ్లు గడిచాకకుటుంబం నుంచి ఒత్తిడి రావడంతో పార్టీలో చేరినా అప్పుడప్పుడూ వ్యతిరేక స్వరమే విన్పించేవారు.

2008లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది టిడిపి. ఐనా తర్వాత టర్మ్ చివరి వరకూ సస్పెన్స్‌లో ఉఁచారు. టిడిపిలో సర్వం చంద్రబాబే అవడంతో తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్‌కి తగినంత ప్రాధాన్యం లభించడం లేదని కినుక వహించేవారు. ఆ కోపంతోనే సమైక్యాంధ్రకి మద్దతుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అందరి ఎంపిల రాజీనామాలు ఆమోదించలేదు కానీ..హరికృష్ణ రాజీనామా మాత్రం స్పీకర్ ఆమోదించడం కూడా కుట్రే అని అంటారు. ఆ తర్వాత పార్టీ వేదికలపై అడపాదడపా కన్పించడమే కానీ, కార్యక్రమాల్లో మనసు పెట్టడం మాత్రం చేసేవారు కాదు. అలా టిడిపి ఆవిర్భావం నుంచి అహర్నిశలు కష్టపడి చైతన్యరధాన్ని వేల మైళ్లు నడిపించిన హరికృష్ణ పార్టీలో ఓ మూలకి నెట్టేశారు. ఐనా ఎవరూ వ్యతిరేక స్వరం విన్పించడంలేదంటే దానికి పార్టీ అధినేతల మాయాజాలమే కారణం అని అంటారు

Comments